మన బాడీలోని చాలా నరాలకు పాదాలతో లింక్ ఉంటుంది. అందువల్ల బాడీలో తేడాలు వస్తే.. ఆ ప్రభావం పాదాలపై పడి.. వాటిలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల మీరు తరచూ మీ పాదాలను చూసుకుంటూ ఉండాలి. వాటిలో తేడా కనిపిస్తే.. ఆ తేడా ఎలాంటిది అన్న దాన్ని బట్టీ.. ఎలాంటి అనారోగ్య సంకేతం ఉందో వెంటనే గుర్తించవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Diabetes : పాదాలకు స్పర్శ, నొప్పి లాంటివి రావట్లేదంటే.. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ బాగా పెరిగినట్లు లెక్క. షుగర్ లెవెల్స్ పెరిగితే.. పాదాలలోని నరాలు దెబ్బతింటాయి. అందుకే స్పర్శ (touch or sensation) కోల్పోతాయి. అంతేకాదు డయాబెటిస్.. పాదాలకు రక్త సరఫరాను సరిగా చెయ్యనివ్వదు. అందుకే పాదాలకు గాయాలైతే త్వరగా తగ్గవు. అలా తగ్గకపోతే.. ఇన్ఫెక్షన్స్ రాగలవు.
Arthritis : ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి కీళ్ల నొప్పులు, కీళ్లు పట్టేసినట్లు అవ్వడం కనిపిస్తుంది. అలాంటి వారి పాదాలు ఉబ్బుతాయి (వాపు - swelling). వారికి నడవడం కష్టంగా అనిపిస్తుంది. అలాగే.. వారు రోజువారీ సింపుల్ పనులు కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. పాదాల్లో ఈ మార్పు వస్తే.. అది ఆర్థరైటిస్ సంకేతంగా గుర్తించాలి.
Osteoporosis : ఇది కూడా ఆర్థరైటిస్ లాంటిదే. కానీ దానికీ, దీనికీ తేడాలున్నాయి. ఆర్థరైటిస్‌లో కీళ్లకు నొప్పి వస్తుంది. అదే అస్థియోపోరోసిస్లో.. ఎముకల మధ్యలో ఖాళీ పెరుగుతూ ఉంటుంది. అంటే.. ఏదో ఒక రోజున ఎముక పెళుసుగా మారి విరిగిపోగలదు. ఈ సమస్య వచ్చిన వారి కాళ్లు, చేతులకు బలంగా ఏదైనా తగిలితే.. ఎముకలు బీటలు వారగలవు. పాదాల్లో ఎముకలు బీటలు వారితే.. అది అస్థియోపోరోసిస్గా గుర్తిస్తారు.
Thyroid problems : మన గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. దానికి తేడా వస్తే.. పాదాల్లో మార్పు కనిపిస్తుంది. పాదాలు పొడిగా, చిన్నగా అవుతాయి. పాదాలపై చర్మం పొలుసులుగా ఊడుతూ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజమ్‌లో పాదాలకు ఎక్కువగా చెమట పడుతుంది. పాదాలు వెచ్చగా అవుతాయి. చర్మం తేమగా మారుతుంది. (Image credit - twitter - BeBlack_coffee)
మొత్తంగా మనం తెలుసుకోవాల్సింది పాదాల్లో మార్పుని. ఒక్కో మార్పు వెనక ఒక్కో కారణం ఉంటుంది. ప్రతి దానికీ భయపడాల్సిన పని లేదు. కానీ.. అదే పనిగా పాదాల్లో మార్పులు వస్తూ ఉంటే మాత్రం లైట్ తీసుకోవద్దు. దగ్గర్లోని చిన్న క్లినిక్‌లో డాక్టర్ నైనా సంప్రదించాలి. తద్వారా సమస్య చిన్నగా ఉన్నప్పుడే.. దానికి బ్రేక్ వేసేందుకు వీలవుతుంది.