ఈ అధ్యయనంలో వారిలోని మానసిక కుంగుబాటు లక్షణాలు పూర్తిగా తగ్గాయని, వారానికి గంటపాటు యోగా చేయడం వల్ల మెదడులోని నాడీ వ్యవస్థలో సందేశాల బదిలీలో కీలకంగా పనిచేసే ‘గమ్మా అమినో బ్యూటైరిక్ యాసిడ్ ’(గాబా) మోతాదు పెరగడాన్ని గుర్తించారు. అయితే ఆ యోగా సెషన్ ముగిసి నాలుగు రోజుల తర్వాత గాబా స్థాయి బాగానే ఉంది. కానీ ఎనిమిది రోజుల తర్వాత నాడీ కణాల్లోని గాబా స్థాయి పెరగలేదని వారు గుర్తించారు.
వాస్తవానికి యోగా అనేది పూరాతమైన చికిత్స ప్రక్రియ. కానీ కాలక్రమేణా యోగాను విస్మరించడం వల్ల అది మరుగునపడిపోయింది. ఇటీవల కాలంలో యోగాను ప్రాముఖ్యత పెరగడం.. ప్రపంచ దేశాలు సైత ఆచరిస్తుండడంతో తిరిగి యోగాకు పునర్వైభవం వస్తుంది. అయితే ఇంకా చాలామంది యోగాను కేవలం శరీర అందానికి పనికొచ్చే విషయంగానే చూస్తున్నారు. కానీ ఇది నిజానికి శరీర అందంతో పాటు మనస్సును అదుపులో ఉంచుతుంది.
సాధారణంగా కొన్ని వ్యాధులకు మానసిక వ్యథ కారణమే. అయితే మానసిక వ్యథ అనేదాన్ని నయం చేసేందుకు మెడిసిన్ కంటే యోగా ప్రక్రియ అత్యుత్తమం. నిత్యం యోగాను ఆచరించడం వల్ల మనస్సు, శరీరం రెండూ అదుపులో ఉంటాయి. ఫలితంగా అనేక వ్యాధుల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ విషయాన్నిఇటీవల కొంతమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం నిరూపించడం గమనార్హం.