మహిళలు సరైన బరువు ఉండేలా ప్రోత్సహించడం, వెయిట్ మేనేజ్మెంట్ కోసం అన్ హెల్తీ పద్ధతులను ఆశ్రయించకుండా అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. మహిళలు ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఎలా బరువు తగ్గాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను బెంగళూరు, ఆస్టర్ CMI హాస్పిటల్, క్లినికల్ న్యూట్రిషన్ డైటెటిక్స్- హెడ్ శ్రీమతి ఎడ్వినా రాజ్ వివరించారు. ఆమె టిప్ప్ ఇలా.. (Ms Edwina Raj, Head, Clinical Nutrition Dietics, Aster CMI Hospital, Bengaluru)
* మహిళల్లో పెరిగిన బాడీ ఇమేజ్ సమస్యలు : గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. చాలా మంది సెలబ్రిటీ-స్టైల్ బాడీల కోసం ప్రయత్నిస్తున్నారు. మంచి కంటే ఎక్కువ నష్టం కలిగించే అన్ హెల్తీ డైట్లు, సెల్ఫ్ స్టైల్డ్ వర్కౌట్లు అనుసరించే వారి సంఖ్య పెరిగింది. సన్నగా ఉండటం అన్నదొక్కటే లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు చాలా మంది మహిళలు బరువు తగ్గడం, ఫిట్నెస్ సాధించడం ఒకటిగా భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో మహిళల్లో 'బాడీ ఇమేజ్' సమస్యలు పెరిగిపోయాయి. దంపతులలో వంధ్యత్వానికి సంబంధించిన ఆందోళనలు పెరగడం వల్ల వారిలో ఎక్కువ మంది బరువును అవమానంగా భావిస్తున్నారు. ఇది వారిని మానసికంగా కలవరపెడుతుంది. తక్షణమే బరువు తగ్గిపోవాలనే ఆలోచనతో అన్ హెల్తీ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. కానీ మహిళలు తమ సొంత మార్గంలో ప్రత్యేకమైన వారని, అందంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి.
* ఒక గ్లాసు హాట్ వాటర్‌తో రోజును ప్రారంభించండి : రోజును ఒక గ్లాసు వేడి నీటితో ప్రారంభించండి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండండి. వేడి నీరు తాగడం వికారంగా అనిపిస్తే సున్నం లేదా పండ్లతో కలిపిన నీటిని కలుపుకోవచ్చు. లేదా గార్డెన్ క్రేస్ సీడ్స్ లేదా చియా గింజలను నానబెట్టిన నీటిని యాడ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా చాలా ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.
* బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయవద్దు : ఓ పరిశోధన వివరాల ప్రకారం.. అల్పాహారం మానేయడం బరువు పెరుగడానికి లేదా ఊబకాయానికి కారణమవుతుంది. గుండె జబ్బులతో మరణించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. ఇది రాత్రిపూట ఉపవాసాన్ని విరమించుకోవడానికి ఉపయోగపడుతుంది.
* తగినంత కాల్షియం తీసుకోవాలి : వయస్సు పెరిగే కొద్దీ, ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోతుంది. ఇది మహిళల్లో పీరియడ్స్ ఆగిపోయే వరకు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలకంగా పని చేస్తుంది. అందువల్ల మహిళలు బలమైన ఎముకల కోసం కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి పెరుగు, బాదం పాలు, సోయా, పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, చేపలు, నేరేడు పండ్లు, నువ్వులు మొదలైన వాటిల్లో సమృద్ధిగా లభిస్తాయి.
* రీప్రొడక్టివ్ ఇయర్స్‌లో(పునరుత్పత్తి సంవత్సరాలు) ఇవి తీసుకోండి :పోషకాలు అధికంగా ఉండే సమతుల ఆహారం ద్వారా శరీరానికి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు అందుతాయి. కొవ్వులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల ద్వారా శరీరానికి ఐరన్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 అందుతాయి. గుండె జబ్బులు, ఊబకాయం ప్రమాదాన్ని పెంచే జంక్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ను, చక్కెరను తప్పనిసరిగా తగ్గించాలి.
* క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి : ప్రసవం నుంచి పీరియడ్స్ ఆగిపోయే దశ వరకు మహిళల శరీరం అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. అందువల్ల 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు తప్పనిసరిగా క్రమబద్ధమైన స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. వారిపై ప్రభావం చూపే ఏవైనా ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. వయస్సు కోసం సిఫార్సు చేసిన టెస్ట్‌లను అర్థం చేసుకోవడానికి, రిజిస్టర్డ్ క్లినికల్ డైటీషియన్ సూచించిన పోషకాహార సంరక్షణ ప్రణాళికను అనుసరించడానికి హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని క్రమం తప్పకుండా కలవాలి.