ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనిపించినప్పుడు వారి రిలేషన్షిప్ స్వభావాన్ని గుర్తించడం కష్టం. చాలామంది ఇతరులతో రిలేషన్షిప్ ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా తెలియని పరిస్థితిలో ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్న వ్యక్తులు పరస్పరం ప్రేమ భావాలను కలిగి ఉంటారు. అయితే వారి రిలేషన్షిప్ స్టేటస్ ఏంటనేది వారికి తెలియదు. అంటే వీరు రిలేషన్షిప్లో ఉంటారు కానీ.. ఆ రిలేషన్‌షిప్‌ను నిర్వచించలేరు. దీన్నే సిచ్యుయేషన్‌షిప్ అంటారు. ఇలాంటి పరిస్థితులో చిక్కుకున్నట్లు కొన్ని విషయాల ద్వారా గుర్తించవచ్చు. అవేంటో పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
రిలేషన్షిప్ ఎలాంటిదో చెప్పలేకపోవడం
స్పష్టమైన ఆధారం ఉన్నా మీ రిలేషన్‌షిప్‌ను నిర్వచించడంలో అవతల వ్యక్తి వైఫల్యం చెందితే మీరు ప్రతికూల పరిస్థితిలో ఉన్నారని అర్థం. మీరు మీ రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తే.. మీ పార్ట్నర్ మీ మాట విననట్లు నటిస్తూ, విషయాన్ని దృష్టి మరల్చడం లేదా అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడం వంటివి చేస్తే మంచిది కాదు. అయితే వారికి ఏం కావాలో అప్పుడు తెలియకపోతే ఫర్వాలేదు. కానీ వారు మీ రిలేషన్‌షిప్‌పై కచ్చితమైన నిర్ణయం తెలియజేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* రిలేషన్‌షిప్‌ను వదులుకోవటానికి ప్రయత్నాలు
మీరు నిజంగా ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు.. మీరు వారితో మరింత లోతుగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. కొత్త రిలేషన్షిప్లో ఆశించినంత ఎక్కువ సమయం వారు మీతో గడపకపోతే లేదా సంభాషణలు లోతుగా లేకుంటే, వారు మీతో లాంగ్‌టర్మ్ రిలేషన్‌షిప్‌పై ఆసక్తి చూపటం లేదని అర్ధం. వారు మీతో సంబంధాన్ని గుర్తించకపోతే ఫర్వాలేదు. అయితే ఆలస్యం కాకుండా అసలు విషయం ఎంటో త్వరగా కనుక్కోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
పైన చెప్పిన నాలుగు సందర్భాలతో పాటు ఇతర కారణాలు ద్వారా ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందో చెప్పవచ్చు. ఇష్టంలేని వ్యక్తి ఏం చెప్పినా అవతలి వ్యక్తి చేయకపోవడం... అసలు వారిని పట్టించుకోకపోవడం... చీటికిమాటికి విసుగు చెందడం... కొన్ని రోజులు కాంటాక్ట్ లేకపోవడం తదితర కారణాలు బట్టి వారు సిచ్యుయేషన్షిప్లో ఉన్నట్లు పసిగట్టవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)