మీ హార్ట్ బీట్ (Heart Beat)ను పెంచే లేదా మీ రక్తప్రసరణ (Blood Circulation)ని మెరుగుపరిచే ఏ రకమైన చర్యనైనా ఎక్సర్సైజ్గా పరిగణించవచ్చు. ఆ లెక్కన నడక (Walking) అనేది కూడా ఒక వ్యాయామమే. మానవుల శరీర నిర్మాణం ఎక్కువగా వాకింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. అందుకే నడకను డాక్టర్లు అందరికీ రికమండ్ చేస్తుంటారు. వాకింగ్ ఒక సింపుల్ ఎక్సర్సైజ్ (Exercise) అయినప్పటికీ ఇది ఒత్తిడి (Stress) తగ్గించడం నుంచి కండరాలను దృఢంగా మార్చేంత వరకు బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాల (Health Benefits)ను చేకూర్చుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్
ఇప్పటివరకు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండని వారికి వాకింగ్ లేదా రన్నింగ్ రొటీన్ ఉత్తమంగా నిలుస్తుంది. ప్రతిరోజూ నడవడం వల్ల బరువు, ఆరోగ్యం, కేలరీలను అదుపులో ఉంచుకోవచ్చు. నడక వంటి తేలికైన వ్యాయామాలు గుండె సంబంధ వ్యాధులు వచ్చే రిస్క్‌ను బాగా తగ్గిస్తాయి. వేగంగా నడవటం వల్ల శ్వాసక్రియ వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేగంగా నడుస్తున్నప్పుడు గాలి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పరిమాణం పెరుగుతుంది. రక్తపోటు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా వాకింగ్ చెక్ పెడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వాకింగ్ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ వాకింగ్ చేయడం ద్వారా మనలో ఓర్పు పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వాకింగ్ చేయడం వల్ల ఆడ, మగ భేదం లేకుండా అందరికీ సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే డైలీ ఒకే దూరం, ఒకే ప్రదేశంలో వాకింగ్ చేయడం వల్ల పూర్తిస్థాయిలో బెనిఫిట్స్ పొందలేము. అందుకే డిఫరెంట్ ప్లేసుల్లో రోజూ కాస్త ఎక్కువసేపు నడవడం మంచిది. మీరు పార్క్‌లో నడవచ్చు. మీ ట్రెడ్‌మిల్‌పై రోజూ కొంత ఎక్కువ దూరం నడిచేలా సెట్ చేసుకోవచ్చు. లేదా అంతస్తుల పైకి నడుస్తూ మీ శరీరాన్ని మరింత స్ట్రాంగ్‌గా మార్చొచ్చు. మీరు మ్యూజిక్ వినే సమయంలో ఊరికే కూర్చోకుండా నడవడం ద్వారా కేలరీలు కరిగించుకోవచ్చు. మరింత వేగంగా, మరింత ఎక్కువసేపు నడవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)