లవ్ మ్యారేజ్ చేసుకోవాలని మనలో చాలా మంది భావిస్తారు. మనం ప్రేమించిన, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలోకి వస్తే సంతోషంగా ఉండవచ్చు. అదే పెద్దల కుదిర్చిన వివాహాల్లో(Arranged Marriages) పరిచయంలేని వ్యక్తులు జీవిత భాగస్వామిగా ప్రవేశిస్తారు. ఫలితంగా మనస్పర్థలు, కలతలు తలెత్తే అవకాశముంది.(ప్రతీకాత్మక చిత్రం)
కాబట్టి మీకు పరిచయం ఉన్న, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరిక మనస్సులో బలంగా ఉంటుంది. మీ ఇంటి వాస్తు(Vastu) కూడా ప్రేమ వివాహం చేసుకోగల పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని మీకు తెలుసా? ఇది నిజమేనని చెబుతున్నారు కొంతమంది వాస్తునిపుణులు. కొన్ని వాస్తు నియమాలు పాటించడం ద్వారా మీ లవ్ మ్యారేజ్ (Love marriage) కోరిక నెరవేరుతుంది. ఆ వాస్తు టిప్స్ ఏవో చూద్దాం.(ప్రతీకాత్మక చిత్రం)
క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం..
ప్రతి గురువారం నాడు గుడికి వెళ్లి దేవతలకు నైవేద్యం, మిఠాయిలు సమర్పించడం మంచిది. ప్రేమ వివాహం కోసం మీరు ఎంత తీవ్రంగా ప్రార్థిస్తే మీ కోరిక అంత త్వరగా తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారాల్లో గుడికి వెళ్లడం మానుకోకండి. క్రమం తప్పకుండా మీరు ఇలా చేస్తూ నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. పాజిటివ్‌గా ఉండటాన్ని విశ్వసించండి. అప్పుడే మీరు విజయం సాధించగలరు.(ప్రతీకాత్మక చిత్రం)
మంత్రం పఠించండి..
ప్రేమ వివాహంలో విజయం సాధించాలంటే లక్ష్మీ దేవి, విష్ణుమూర్తి విగ్రహాలను ఇంట్లో ఉంచండి. గురువారం నాడు శుక్లపక్షాన్ని ప్రారంభించండి. దీంతోపాటు లక్ష్మీ నారాయణ నమః అనే మంత్రాన్ని రోజుకు మూడు మాలలు పూర్తయ్యేంత వరకు పఠించండి. ఈ విధంగా క్రమం తప్పకుండా మూడు నెలలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)