అధిక బరువు ఇటీవలి కాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య. అయితే ఈ సమస్యకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లే అని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ కారణంగా అధిక బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వివరిస్తున్నారు. మీ ఆహారంలో ఈ కింది వాటిని చేరిస్తే అధిక బరువు సమస్య నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పుల్లని పండ్లు - ద్రాక్ష తప్ప నారింజ, బేరి, నిమ్మ, బొప్పాయి మొదలైన పుల్లని పండ్లలో ఫైబర్ మరియు విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది అమైనో కణాలను ప్రేరేపించడం ద్వారా కొవ్వును తగ్గించడానికి పనిచేస్తుంది. ఈ పండ్లలో నీరు అధికంగా ఉండడం కారణంగా కడుపు తొందరగా నిండుతుంది.(Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm the same. Before implementing these, please contact the concerned expert.)