మీరు ఏదైనా సర్జరీకి ప్లాన్ చేసుకున్నట్లయితే, అందకు రెండు మూడు రోజుల ముందు నుంచే ఉసిరిని తినడం ఆపేయాలి. ఎందుకంటే ఉసిరిలో రక్తాన్ని పలుచబరిచే గుణం ఉంటుంది. ఉసిరి తినడం రక్తస్రావం వంటి సమస్యలు రావొచ్చు. దీని కారణంగా టిష్యూ హైపోక్సేమియా, CVR అసిడోసిస్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సమస్యలు రావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
రక్తస్రావం సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఉసిరికి దూరంగా ఉండాలి. ఇందులో యాంటీ ప్లేట్లెట్ గుణాలు ఉన్నాయి. శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని ఇది నిరోధిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కానీ బ్లీడింగ్ డిజార్డర్ సమస్యలు ఉన్న వారు ఉసిరి తింటే .. ఆ సమస్య మరింత పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)