మనం తీసుకునే ఆహారం రెండు దశల్లో జీర్ణమవుతుంది. కార్బో హ్రైడ్రేట్లు,పిండి పదార్థాలు, పీచు పదార్థాలు చిన్న పేగుల్లో కొంతవరకు జీర్ణమవుతాయి. ఆపై పెద్ద పేగుల్లో మిగతా జీర్ణ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో హైడ్రోజన్,కార్బో హైడ్రేట్ వంటి వాయువులు విడుదలవుతాయి. పేగుల్లో ఉండే బాక్టీరియా ఈ వాయువుల సాయంతో హైడ్రోజన్ సల్ఫేడ్,మీథేన్ వంటి గ్యాస్‌లను ఉత్పత్తి చేస్తుంది.
గ్యాస్ అసిడిటీ నివారణ : శరీరానికి సరిపడే ఆహారాన్నే తీసుకోవాలి. సరైన డైట్‌తో మిత ఆహారాన్నే తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తే.. ఆహారం త్వరగా జీర్ణమవడంతో పాటు గ్యాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు.