ఆహారంలో రంగుకు ప్రత్యేక స్థానం ఉంది. పండ్లు, కూరగాయల రంగు.. వాటిలో కనిపించే పోషకాల కారణంగా ఉంటుంది. ఈ మూలకాలలో ఒకటి లైకోపీన్. ఇది అన్ని పండ్లు, కూరగాయలు ఎరుపు రంగులో ఉన్నాయంటే అందులో లైకోపిన్ ఉన్నట్లుగా భావించాలి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదట. ఎర్రటి యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లతో పాటు ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. యాపిల్ తింటే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు యాపిల్ చాలా మేలు చేస్తుందని డాక్టర్లు కూడా చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
దానిమ్మ మన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అంటే శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లామెటరీ గుణాలు కూడా ఉన్నాయి. అంటే శరీరంలో ఎక్కడైనా మంటగా అనిపిస్తే దానిమ్మితో మంచి ఉపశమనం కలుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
బీట్రూట్లో అన్ని విటమిన్లు, మినరల్స్‌తో పాటు లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన శరీరంలో రక్త కొరతను తగ్గిస్తుంది. రక్తం పెరగడానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా వైరల్ ఫీవర్లు మన దరి చేరవు. బీట్ రూట్‌ను రోజూ మన ఆహారంలో చేర్చుకుంటే.. కాలేయం మెరుగ్గా పని చేస్తుంది.