నిజానికి పిల్లలు గోళ్లు నమలడం చూసి చాలామంది తల్లిదండ్రులు పెద్దగా సీరియస్గా పట్టించుకోరు. గోళ్లు తిన్నప్పుడు తిట్టి.. ఆ తర్వాత వదిలేస్తారు. ఇలా ఎప్పుడో మందలించడం వల్ల ఆ ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. మీరు తిట్టాక ఒకటి రెండు రోజుల పాటు గోర్లు తినకపోవచ్చు. కానీ ఆ తర్వాత మళ్లీ ప్రారంభిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గోర్లు నమలడం ద్వారా , చేతి వేలల్లోని సూక్ష్మక్రిములు నేరుగా శరీరంలోకి వెళ్లి పిల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పలు రకాల వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఈ అలవాటు పిల్లల మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
గోళ్లు నమిలే సమస్య రాత్రికి రాత్రే పోదు. పిల్లలు ఈ అలవాటును విడిచిపెట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. అందుకే పిల్లల గోర్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత మీ పిల్లలు గోర్లు తిన్నా పెద్దగా ప్రమాదం ఉండదు. అదే మురికిగా ఉన్న గోర్లను తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)