మనకు చర్మ ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చర్మం బాలేకపోతే.. నలుగురిలో తిరగలేం. నవ్వుతూ ఉండలేం. మానిసికంగానూ కుంగిపోతాం. హానికారక సూర్యకిరణాలు, కాలుష్యం వల్ల చర్మం పాడవుతుంటుంది. కల్తీ ఆహారాలు, పురుగుల మందులు, రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులు, వాతావరణంలో మార్పులు మన చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
పిత్త సమస్యలు ఉన్నవారు పుల్లటి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం.. చింతపండు, ఉసిరికాయ, నిమ్మకాయ వంటి పుల్లని రుచి కలిగిన పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పిత్త దోషం పెరుగుతుంది. రక్తంలో పిత్తం కలిస్తే అందులో మలినాలు పెరుగుతాయి. ఇది దురద, మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను పెంచుతుంది. అందుకే చర్మ సమస్యలున్న వారు సిట్రస్ పళ్లకు దూరంగా ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
వాత లేదా వాయు సమస్యలు ఉన్నవారు గ్లూటెన్ ఎక్కువగా ఉన్న ఆహారాల పదార్థాలకు దూరంగా ఉండాలి. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడు కూడా.. గ్లూటెన్ ఉన్న ఆహారాల వినియోగాన్ని తగ్గించాలి. లేదంటే మీ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. గ్లూటెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది ప్రేగులు, చర్మాన్ని దెబ్బతీస్తుంది. గోధుమలు కాకుండా.. వోట్స్, బార్లీ వంటి పదార్థాల్లో గ్లూటెన్ కనిపిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
దగ్గు సమస్య ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులను దూరంగా ఉండాలి. క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి. మొటిమలు, జిడ్డు చర్మం వంటి సమస్యలు ఉన్నవారు పాలను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. పాలలో ఉండే లాక్టోస్ హార్మోన్ల స్థాయి అసమతుల్యతతో ఉంటుంది. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)