భారతీయులు నెయ్యి (Ghee)ని ఎక్కువగా వాడతారు. రుచికరమైన స్వీట్ల నుంచి ఘుమఘుమలాడే బిర్యానీ వరకు.. చాలా వంటకాల్లో నెయ్యిని వినియోగిస్తారు. ఐతే నెయ్యిని తింటే బరువు పెరుగుతారని చాలా మంది భయపడతారు. అందుకే నెయ్యి వైపు కన్నెత్తి చూడరు. నెయ్యి లేని పదార్థాలనే తింటుంటారు. కానీ ఇది అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మీరు ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే.. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కలిగే సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రోజంతా కూర్చునే అలవాటు, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వంటి అనేక కారణాల వల్ల ఉదర ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాంటప్పుడు నెయ్యి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
నెయ్యి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖం అందంగా కనిపిస్తుంది. ముడతలు తగ్గి వయసు తగ్గినట్లుగా మారిపోతారు. ప్రేగుల్లో కదలికను మెరుగుపరచడానికి నెయ్యి తినవచ్చు. మలబద్ధకం ఉన్నవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినాలి. అప్పుడు పేగుల్లో కదలిక ఏర్పడి సుఖ విరేచనం అవుతుంది.