కిడ్నీలో రాళ్లుఅనేవి చాలా సాధారణ సమస్య. ప్రస్తుతం వయసుతో పనిలేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు సర్వసాధారణంగా మారిపోయింది. బ్లడ్లో ఎక్కువ కాల్షియం ఉండడం లేదా..కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్లని ఎక్కువ రోజులు తీసుకోవడం, పాలకూర, నట్స్, చాకొలేట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం, ఫైబర్, మెగ్నీషియం తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వంటి అనేక రీజన్స్ కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణం కావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ రసాన్ని ఒడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు యూరియన్ రూపంలో బయటకు పోతాయి. కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషధమని నవీన్ రోయ్ నడిమిటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పప్పు దినుసులు, జీడి పప్పు, బాదం పప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, అరటి పండ్లు, ఆకు కూరల్లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాల్షియమ్ బయటకి పంపబడుతుంది. నేల ఉసిరి ఆకు పొడి రోజుకి 4 గ్రాములు నీటిలో కలుపుకొని తాగడం వల్ల కిడ్నీ ల్లో, అన్ని మృదు కణజాలం లో పేరుకొని వున్న క్యాల్షియం శరీరం నుండి బయటకు పంపించి వేయ బడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అతిగా మద్యం సేవించడం, అతిగా ఉప్పు తినడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి. పాలు వెన్న జున్ను లాంటి పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు. మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వలన మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. టమాటాలు, శీతల పానీయాల వినియోగం కూడా అదుపులో ఉంచాలి. చక్కెరను తక్కువ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)