Home » photogallery » life-style »

HEALTH TIPS HERE ARE TARO ROOT AMAZING HEALTH BENEFITS LIKE BLOOD PRESSURE AND SUGAR LEVELS UNDER CONTROL SRD

Taro Root Benefits : చేమ దుంపతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. వెంటనే మీ ఆహారంలో చేర్చుకోండి..

Taro Root Benefits : దుంపల్లో కొన్నింటిని పచ్చిగానే తినొచ్చు... కొన్నింటిని వండుకొని తినగలం. చేమ దుంపల్ని వండుకొని మాత్రమే తినగలం. ఇవి జిగురుగా ఉంటాయని చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు. నిజానికి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చేమ దుంపల్ని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి బదులుగా వీటిని తింటారని తెలుసా. మంచి రుచినీ, పోషకాలనీ ఇవి ఇస్తాయి. 100 గ్రాముల చేమదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది. వీటిలో ఎక్కువ కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ దొరుకుతాయి. ఈ చేమ దుంపల తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం.