మటన్ ఎంతసేపు ఉడికించినా ఉడకకపోతే అందులో అరటి తొక్కను వేసి ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుందట. అరటి తొక్క లోపలి భాగంతో పాలిష్ చేయడం వల్ల వెండి సామాను తళతళా మెరుస్తూ ఉంటుంది. దీంతో పాటు లెదర్ షూలను కూడా అరటి తొక్కతో పాలిష్ చేయవచ్చు. అరటి తొక్క లోపలి భాగంతో పళ్లను రబ్ చేయడం వల్ల అవి కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఎంత బాగా బ్రష్ చేసినా కొందరి పళ్లు పసుపుబారిపోయి కనిపిస్తుంటాయి. ఇలాంటివారు అరటి తొక్కలను అప్పుడప్పుడూ పళ్లు రబ్ చేయడానికి ఉపయోగించడం వల్ల అవి మెరుస్తాయి. ఇవన్నీ ఒకెత్తైతే అరటి తొక్కను గార్డెనింగ్ లో ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఆర్గానిక్ ఎరువుగా ఇది మొక్కలు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అరటి తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడేందుకు వాటికి శక్తిని అందిస్తుంది. పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయట. పూలు, పండ్లు ఎక్కువగా రావడానికి కూడా ఇది తోడ్పడుతుంది. దీనికోసం అరటి తొక్కలను పెద్ద మొక్కల పక్కన పాతి పెట్టడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)