చాలా మందికి ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం అలవాటు. కానీ అది మీకు హాని కలిగిస్తుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం కడుపులోకి వెళ్లి.. శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ బ్యాక్టీరియా కడుపులో ఎసిడిటీ పెరగకుండా చేస్తుంది. అలంటి బ్యాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ చంపడం వల్ల.. ఎసిడిటీ సమస్యలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
శీతల పానీయాలు తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో శీతల పానీయాలు లేదంటే సోడా వాటర్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది పొట్టలో ఎసిడిటీకి కారణమవుతుంది. పరగడుపున శీతల పానీయాలు తాగితే కడుపు ఉబ్బరం సమస్య కూడా ఉండవచ్చు. అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఉదయాన్నే వేడిగా ఉండే మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఇది ఛాతీలో మంటను కూడా కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో గరం మసాలా తీసుకోవడం వల్ల గ్యాస్ పెరుగుతుంది. ఒక్కోసారి తీవ్రమైన కడుపు నొప్పికి కూడా దారితీస్తుంది. అందుకే బిర్యానీ వంటి మసాలా ఫుడ్‌ని ఉదయం తినకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)