ఉప్పు వల్ల మన పొట్ట, పేగులు కూడా శుభ్రపడతాయి. రక్తపోటు, రక్త ప్రవాహం నియంత్రణలో ఉండాలంటే సోడియం అవసరం. కానీ ఉప్పు ఎక్కువైతే ప్రమాదం కూడా ఉంది. ఉప్పు అధికంగా వాడితే హైబీపీ వచ్చేస్తుంది. గుండె జబ్బులూ రావచ్చు. అందుకే ఉప్పును జాగ్రత్తగా వాడాలి. ఎంత తినాలో అంతే తీసుకోవాలి.