గొంతు నొప్పి సమస్య నుండి ఉపశమనం పొందేందుకు తేనె, నల్ల మిరియాలు వాడాలి. తేనెలో యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గొంతు నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ నుంచి ఇది కాపాడుతుంది. తేనెలాగే నల్ల మిరియాలు కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒక చెంచా తేనెలో చిటికెడు నల్ల మిరియాల పొడిని మిక్స్ చేసి రోజుకు రెండు, మూడు సార్లు తినండి. (ప్రతీకాత్మక చిత్రం)
దగ్గులు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. గొంతు నొప్పికి ఇది మంచి హోమ్ రెమడీ. రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు చిటికెల పసుపు కలుపుకుని తాగాలి. చలికాలంలో ఇలా చేస్తుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. (ప్రతీకాత్మక చిత్రం)