బియ్యంలోనే ఎక్కువ నీరు పోసి కాస్తా ఉడికిన తర్వాత నీటిని వంపేస్తారు. ఆ వంపిన నీటినే గంజి అంటారు. అసలు ఇందులోనే అనేక పోషక విలు ఉంటాయి. అందుకే తాతల కాలంలో చాలా మంది గంజి తాగే బతికేవారు. కానీ, రాను.. రాను ఆ గంజి వాడకం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు గంజిని షాంపూ, బట్టలకి కండీషనర్‌గా వాడేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.