Healthy food for Summer: వేసవి మంటలు సెగలు కక్కేలా చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడి ప్రతాపంతో శరీరమంతా వేడిగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని వేడి చేసే ఆహారం తీసుకోవాలా వద్దా..? ఇలాంటి అనుమానాలు చాలామందిలో ఉంటాయి. ముఖ్యంగా పెరుగు తినవచ్చా.. తినకూడదా అన్నది చాలా మంది సందేహం..
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపే బ్యాక్టీరియోసిన్ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల మనకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధక శక్తిని పెంచుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.