గుండెపోటుకు ప్రధాన కారణం హార్టుకు రక్తం సరఫరాలో అంతరాయం కలగడమే. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల కారణంగా గుండెపోటుకు దారి తీస్తుంది. రక్తాన్ని సరపరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి.దీని వల్ల గుండెకు రక్తం సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు. దీంతో కండరాలు చచ్చుబడి గుండెపోటు వస్తుంది.
గుండెల్లో మంట అనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. ఇది గుండె పోటు సంకేతమని మరచిపోవద్దు. తరచుగా జ్వరం, దగ్గు వచ్చినా అశ్రద్ద చేయవద్దు. గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది. గుండె బరువుగా, అసౌకర్యంగా ఉన్నా కూడా కార్డియాలజిస్టును సంప్రదించాలి. మత్తుగా ఉండి చెమటలు పడుతూ ఉంటే గుండె పోటు రాబోతుందని గుర్తించాలి. తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులను కూడా అశ్రద్ధ చేయవద్దు.
వికారం, వాంతులు, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, కడుపులో మంట ఇవన్నీ కూడా గుండెపోటు సంకేతాలే. కంటిపై కురుపులు వచ్చినా జాగ్రత్త పడాలి. గుండె పోటుకు దారితీస్తాయి. కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతుంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించాలి. ఎడమ చేతి కింద నొప్పిగా ఉంటే అసలు అశ్రద్ధ చేయవద్దు. గుండె పోటు రాబోతుందనే సంకేతాలను అశ్రద్ద చేయవద్దు. కొందరికి దవడలు వాయడం, గొంతు నొప్పులు కూడా గుండె పోటుకు దారితీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఏదైనా చిన్న పని చేయగానే గుండె వేగంగా కొట్టుకుంటుంటే అది గుండపోటుకు దారితీయవచ్చు. పైన చెప్పుకున్న వాటిల్లో ఏ రెండు లక్షణాలు కనిపించినా ఒకసారి టెస్టులు చేయించుకోవడం ఉత్తమం.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)