శరీరంలో కిడ్నీల పనితీరు ఎంతో ముఖ్యం. శరీరంలో కిడ్నీలు ఫిల్టర్ల తరహాలో పని చేస్తాయి. శరీరంలోని మలినాలను, వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో నీరు, ఉప్పు, ఇతర మినరల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కిడ్నీలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అయితే మన రోజూవారీ అలవాట్ల కారణంగా కిడ్నీలకు ఎంత కీడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. వాటిని సరి చేసుకోకపోతే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)