పూలు, మొక్కలు ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అందుకే గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమ వ్యక్తపరుస్తుంటారు చాలా మంది. అంతేకాదు, అవి మన ఇంట్లో ఉంటే.. జీవితంలో ప్రేమకు కొదవే ఉండదని భావిస్తారు. ఈ మొక్కలు ఇంటికి అందంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా చేకూర్చుతాయి. అంతేకాదు, ఈ మొక్కలు ప్రేమ, అదృష్టాన్ని ఆకర్షించడంలో సహాయపడతాయని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జీవితాన్ని ప్రేమమయం చేయగలిగే శక్తి ఉన్న కొన్ని మొక్కలను పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
మల్లె చెట్టు
మల్లె మొక్క ఇంట్లో ఉంటే.. వారి కలలు నిజమౌతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. ప్రేమ, డబ్బు వారికి లభిస్తాయి. ఈ మొక్క నూనెను అత్యంత శక్తివంతమైన కామోద్దీపనలలో ఒకటిగా పరిగణిస్తారు. కాగా, ఇంటి ఆవరణలో మల్లె మొక్క పెంచుకుంటే మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సెక్స్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తులసి.. ఈ మొక్క ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క మన ఇంటి ఆవరణలో పెట్టడం ద్వారా ప్రేమ, సంపద, అందం, అదృష్టాన్ని తీసుకువస్తుంది. మన ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలోనూ సహాయం చేస్తుంది. ఆహారంలో తులసిని భాగం చేస్తే.. ఆ వంటకం తినే వారి అభిరుచి మేల్కొల్పుతుందని నమ్ముతారు. ఎందుకంటే, దీనిలో మంచి యాంటీ సెప్టిక్, యాంటిడిప్రెసెంట్ ఉంటాయి. ఈ మొక్క మెదడు పనితీరును మెరుగుపరచడానికి తులసి చక్కగా పనిచేస్తుంది. కాచి చల్లార్చిన నీటిలో తులసి రసాన్ని కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగడంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
చిట్టి గులాబి
చిట్టి గులాబీ మొక్క ఇంట్లో పెంచుకుంటే లవ్ లైఫ్ ఆనందంగా ఉంటుంది. మీ జీవితంలో ఆనందం, అదృష్టం తీసుకొస్తుంది. ఈ మొక్కలు ఎప్పుడూ మీ జీవిత భాగస్వామి పట్ల ఆకర్షితులు అయ్యేలా చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాదు, గులాబీలు మనలో శృంగార కాంక్షలను రెట్టింపు చేస్తాయి. ఎదుటి వారిని ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే, ప్రేమికులు గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)