ఈరోజుల్లో చాలామందికి చిన్న వయస్సులోనే గుండె జబ్బులు వస్తున్నాయి. ఇలాంటి మరణాలకు కారణం ఏంటంటే ఎక్కువశాతం ఒబేసిటీ, స్మోకింగ్ చేసేవారికి హార్ట్ బ్లాకేజీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. పొల్యూషన్ తోపాటు, విపరీతమైన స్ట్రెస్ కూడా ప్రధానమైన కారణం. తగినంత ఎక్సర్ సైజ్ లేకపోవడం కూడా కారణం.స్మోకింగ్ చేసేవారు వెంటనే ఆపేయండి. రోజూ ఎక్సర్ సైజ్ చేయండి. రెడ్ మీట్ తగ్గించేసి ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలని ప్రముఖ వైద్య నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.
లక్షణం..
గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడితే గుండె కండరం డ్యామేజ్ అయితే హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె ఆగిపోవడం, కొన్ని సార్లు కొట్టుకోవడానికి కార్డియాక్ అరెస్ట్ అంటారు.దీంతో గుండె చాలా వీక్ అయిపోతుంది. దీంతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీని తర్వాత కార్డియో జెనిక్ షాక్ కూడా రావచ్చు. ఇది బ్రెయిన్, కిడ్నీ, లివర్ ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. దీనికి ఎక్మో చికిత్స కూడా అందిస్తారు.
నడుస్తుంటే ఆయాసం వస్తే కూడా గుండెకు సంబంధించిన వ్యాధి.
దీనికి వైద్యుల వద్దకు వెళ్తే వారు ట్రెడ్ మిల్ టెస్ట్ చేసి కన్ఫా మ్ చేస్తారు.యాంజియోగ్రఫి చేస్తారు. కరోనరీ ఆర్తరీ ధమని బ్లాక్ అయినప్పుడు దానికి స్టెంట్ వేస్తారు. దీనికి పేషంట్ లక్షణాలు చూసి తగిన సూచనలు వేస్తారు. 80 శాతం పైగా సివియారిటీ ఉంటే స్టెంట్ వేస్తారు. దానికి తక్కువ సీరియస్ ఉంటే మందులు సిఫార్లు చేస్తారు. దీనికి పూర్తిగా తగ్గుతుందా? అంటేకాదు..వాళ్ల పనులు చేసుకునేలా ఉపయోగపడుతుంది. మైక్రో లెవల్ లో ప్రమాదం తగ్గుతుంది. ఇలాంటి మందులు చెప్పిన విధంగా లైఫ్ లాంగ్ వాడాలి.
తగ్గించాల్సిన ఫుడ్స్..
బరువు పెరగడం హార్ట్ బ్లాకేజీలకు ప్రథమ కారణం. హార్ట్ బ్లాక్స్ రావడానికి కారణం వైట్ ప్రొడాక్ట్స్ కూడా. బియ్యం, మైదా, తదితరాలు. వీటి వల్ల ఒబెసిటీతోపాటు హార్ట్ బ్లాక్స్ కూడా పెరుగుతాయి. కార్బొహైడ్రేట్స్ ఎక్కువై ఈ పరిస్థితికి కారణమవుతాయి. రక్తంలో చక్కెర ఎక్కువయ్యే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది.రక్తంలో కొవ్వు ఎక్కువగా తయారవుతుంది. పిండిపదార్థాలు ఎక్కువగా తోడ్పడతాయి.
హెచ్ డీ ఎల్ 40, ఎల్ డీ ఎల్ 100 లోపు ఉండాలి. ఎక్కువైతే అది హార్ట్, మెదడు, కాళ్లలో రక్తనాళల్లో స్టోర్ అయిపోతుంది. దీంతో రక్తప్రసరణ ఆగిపోతుంది. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతే ప్రాణాపాయమే..వైట్ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించేయండి. 15 ఏళ్ల వయస్సు నుంచే కూడా హార్ట్ సమస్యలతో మరణిస్తున్నారు. హెచ్ డీ ఎల్ మంచి కొలెస్ట్రాల్ మంచిది. జంతు సంబంధిత ఫుడ్స్ తగ్గించేయండి. రోజుల్లో 70 శాతం మంచి ఆహారం తీసుకోవాలి.