HEALTH TELUGU HEALTH TIPS WEIGHT LOSS TIPS HOME REMEDIES TO REDUCE YOUR LOWER BELLY FAT IN 7 DAYS WITHOUT EXERCISE SK
Weight Loss Tips: ఎక్సర్సైజ్ లేకుండానే పొట్టను తగ్గించండి.. 7 రోజుల్లోనే అనూహ్య మార్పులు
Weight Loss Tips: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడంతో భారీగా బరువు పెరుగుతున్నారు. 20 ఏళ్లకే అంత పెద్ద పొట్ట వేసుకొని తిరుగుతున్నారు. స్లిమ్‌గా కనిపించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఐనా మార్పు రావడం లేదు. మరి పొట్టను తగ్గించడం ఎలా?
పొట్టను తగ్గించడం కోసం ఎంతో మంది పలు రకాల ఎక్సర్సైజులు చేస్తున్నారు. యోగాసనాలు, వర్కవుట్స్ చేస్తూ కష్టపడుతున్నారు. కానీ ఎన్ని చేసినా పొట్ట మాత్రం తగ్గడం లేదు. కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండానే చాలా సింపుల్‌గా పొట్టను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా..? అది ఎలాగో ఇక్కడ చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ప్రతి రోజూ నిద్రపోయే ముందు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగాలి. అలాగే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పరగడుపుతో మరో రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఉదయం వెల్లుల్లి రెబ్బలను తిన్న తర్వాత నిమ్మరసం తాగాలి. గోరువచ్చని నీటితో నిమ్మరసం కలపుకోవాలి. ఉప్పు వేయకండి. చక్కెరకు బదులు తేను వాడితే చాలా మంచిది. రెగ్యులర్‌గా ఇలా చేస్తే మెటబాలిక్ ప్రాసెస్ మెరుగుపడి పొట్ట తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
భోజనం నుంచి తెల్ల బియ్యంతో చేసిన అన్నాన్ని తగ్గించండి. దానికి బదులు రెడ్ రైస్, గోధుమ బ్రెడ్, ఓట్స్ బ్రెడ్‌తో భోజనం చేయండి. ఈ డైట్‌ను ఫాలో అయితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
వంటల్లో దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాలు, పచ్చి మిర్చి ఉండేలా చూసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి.. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. తద్వారా శరీంలో కొవ్వు తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
షుగర్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్‌తో పాటు అన్ని రకాల స్వీట్లను 7 రోజుల పాటు అస్సలు తినకండి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఏడు రోజుల పాటు ఎలాంటి మాంసాహారం ముట్టకూడదు. చికెన్, మటన్, గుడ్లు,చేపలు.. ఏవీ తినకూడదు. చేపల కొంత వరకు తినవచ్చు. కానీ చర్మం తీసేసిన చేప ముక్కలతో మాత్రమే ఆహారం వండుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తింటే మంచిది. వీటి వలన శరీరానికి కావాల్సిన యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు సమృద్దిగా అందుతాయి.
9/ 9
మంచి నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని ఎక్కువగా తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరం నుంచి మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ డైట్‌ను ఫాలో అయితే... ఖచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)