పీరియడ్స్ సమయంలో మహిళలకు రాత్రిపూట ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. అయితే అదొక్కటే కారణం కాదు. రాత్రిపూట విపరీతమైన చెమటలు ఇతర అనారోగ్యాలకు సంకేతంగా ఉండవచ్చు. అవి ఏమిటో చూద్దాం.
2/ 8
ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్: ఎటువంటి వైద్యపరమైన కారణం లేకుండా శరీరంలో అధికంగా చెమట పట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
3/ 8
ఇన్ఫెక్షియస్ డిసీజ్: క్షయ వ్యాధి ఉన్నవారికి రాత్రిపూట ఎక్కువగా చెమట పడుతాయి. ఎండోకార్డిటిస్ (గుండె కవాటాల వాపు), ఆస్టియోమైలిటిస్ (ఎముకల వాపు) మరియు చీము వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాత్రిపూట విపరీతమైన చెమటను కలిగిస్తాయి. HIV బాధితులకు కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
4/ 8
క్యాన్సర్: రాత్రిపూట ఎక్కువగా చెమట పట్టడం అనేది లింఫోమా వంటి కొన్ని క్యాన్సర్ల ప్రారంభ లక్షణం. రాత్రిపూట చెమటలు పట్టడం కూడా గుర్తించబడని క్యాన్సర్ల ప్రారంభ సంకేతం.
5/ 8
మందులు కారణం కావచ్చు: మీరు ఏదైనా అనారోగ్యానికి మందులు తీసుకుంటుంటే వాటి దుష్ప్రభావాల వల్ల కూడా చెమట పట్టవచ్చు. ఆస్పిరిన్ మరియు ఎసిటమైనోఫెన్ వంటి జ్వరాన్ని తగ్గించే మందులు కొన్నిసార్లు చెమటను కలిగిస్తాయి.
6/ 8
బ్లడ్ షుగర్ లెవెల్: రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట చెమటలు పట్టడం పెరుగుతుంది. మధుమేహాన్ని నియంత్రించే మందులు కూడా చెమట పట్టేలా చేస్తాయి.
7/ 8
హార్మోన్ల సమస్య: మీరు కార్సినోయిడ్ సిండ్రోమ్, ఫియోక్రోమోసైటోమా మరియు హైపర్ థైరాయిడిజం వంటి హార్మోన్ల రుగ్మతలతో బాధపడుతుంటే, రాత్రిపూట విపరీతమైన చెమటలు పట్టవచ్చు.
8/ 8
నరాల సమస్యలు: అటానమిక్ న్యూరోపతి, పక్షవాతం, డైస్రెఫ్లెక్సియా, సిరింగోమైలియా మరియు శస్త్రచికిత్స అనంతర నరాల సమస్యలు, రాత్రిపూట అధిక చెమట పడుతుంది.