1. పిండి పదార్ధం నుంచి చక్కెరగా మారే అరటిపండ్లు
అరటిపండ్లు ఆకుపచ్చ, పసుపు రంగు నుంచి నల్లటి మచ్చల రంగులోకి మారినప్పుడు... అవి తియ్యగా మారుతాయి. చాలా తియ్యగా ఉండే ఈ మచ్చల అరటిపండ్లు బ్లడ్ షుగర్ మీద చెడు ప్రభావం చూపుతాయి. నిజానికి అరటిపండ్లు పండే కొద్దీ గ్లైసెమిక్ ఇండెక్స్ రెట్టింపు అవుతుంది. అందుకే అరటిపండ్లు కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడే తినాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అరటి వల్ల తీవ్రమయ్యే మలబద్ధకం సమస్యలు పచ్చి అరటికాయ మీ మలబద్ధకం సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆకుపచ్చ అరటికాయలోని పెక్టిన్ ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ అనే మాలిక్యూల్స్ వల్ల అవి చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందుకే స్లో-డైజేషన్ సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని ఎట్టి పరిస్థితులలోనూ తినకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అరటిలోని ఫైబర్ తో సమస్యలు
పచ్చి అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి వీటిని తింటూ ఆకలిని తగ్గించుకోవచ్చు. తద్వారా బరువు తగ్గొచ్చు. కానీ ఇవి బరువు పెరగాలి అనుకునేవారిపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే ఇవి తిన్న తర్వాత కడుపు నిండిన భావన చాలా సేపు ఉంటుంది. తద్వారా మిగతా ఫుడ్ తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గే ప్రమాదం ఉంది. అలాగే బ్లోటింగ్, గ్యాస్, పొత్తికడుపులో నొప్పి వంటి డైజెస్టివ్ సమస్యలు వస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4. బూస్ట్ అయ్యే ఎలక్ట్రోలైట్లు
అరటిపండ్లతో చక్కటి ప్రయోజనాలూ ఉంటాయి. ప్రధానంగా వీటిలో లభించే పొటాషియం, మెగ్నీషియం మీ రోజువారీ అవసరాలలో దాదాపు 10% తీర్చుతాయి. పొటాషియం, మెగ్నీషియంలను ఎలక్ట్రోలైట్లను తయారు చేసే ముఖ్యమైన మినరల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి రెండు సహజసిద్ధమైన పండ్లలో దొరకడం చాలా అరుదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎలక్ట్రోలైట్లు నీటిని, శక్తిని రక్తప్రవాహానికి బదులుగా కండరాలలోకి తరలిస్తాయి. దీని అర్థం మీ కండరాలు ఎక్సర్సైజ్ తర్వాత కోలుకోవడానికి అవసరమైన ఇంధనాన్ని పొందుతాయి. తద్వారా మీరు తక్కువ అలసటతో జిమ్ కు రోజూ వెళ్లొచ్చు! అందుకే వర్కౌట్ తర్వాత అరటిపండు తినండి. ఎక్కువగా ప్లూయిడ్స్ తాగండి. మీ మజిల్ టిష్యూ త్వరగా రికవర్ అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
అప్పుడు శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. బాడీలో సోడియం, పొటాషియం ఇవి రెండు కూడా ఎక్కువ కాకూడదు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది సోడియం తమకు తెలియకుండానే అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల హై బ్లడ్ ప్రెజర్ సమస్య తలెత్తుతోంది. అందుకే మితంగా అరటిపండ్లను తింటే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)