HEALTH SUMMER TIPS HOME REMEDIES 5 TIPS FOR A LESS SWEATY SUMMER FOLLOW THESE STEPS SK
Summer Tips: వేసవిలో చెమటతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే తాజాగా ఉంటారు..
Summer Tips: ఎండాకాలంలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య చెమట. కాసేపు బయటకు వెళ్లే వస్తే చాలు.. దుస్తులన్నీ తడిసిపోతాయి. కాసేపటికే కంపుకొడుతుంది. వేడి గాలుల కారణంగా ఇంట్లో ఉన్నా చాలా మందికి ఎక్కువ చెమట పడుతుంది.
చెమట సమస్యకు ఎలా చెక్ పెట్టాలి? ఎక్కువగా చెమట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది? మరి అది ఎలాగో ఇక్కడ చూడండి.
2/ 6
ఒక గ్లాస్ నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. అందులో కాటన్ బాల్‌ను ముంచి... దానితో గొంతు, చంకలు, చేతులు, అరికాళ్లకు మర్దన చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయాలి. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరానికి ఎక్కువ చెమట పట్టదు.
3/ 6
టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపిస్తాయి. ఒక వారం రోజు ప్రతి రోజు గ్లాస్ టమాటా రసం తాగాలి.
4/ 6
ఆహారం మసాలాలు, కారం, నూనె ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. వేసవిలో ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తింటే శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది. అందుకే ఎక్కువగా చెమట వస్తుంది.
5/ 6
ఉప్పు ఎక్కువగా తిన్న చెమట ఎక్కువగా వస్తుంది. అందుకే వేసవిలో ఉప్పును మరిమితంగానే తీసుకోవాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిది.
6/ 6
అధిక ఒత్తిడి, ఆతురత, టెన్షన్ ఎక్కువగా ఉన్నా... చెమట అధికంగా వస్తుంది. అందుకే ప్రతి రోజు ధ్యానం చేయాలి. శ్వాస ఎక్సర్సైజ్లు చేయడం ద్వారానూ చెమట సమస్యకు చెక్ పెట్టవచ్చు.