శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. జీర్ణక్రియల నిర్వహణతో పాటు రక్తశుద్ధి ప్రక్రియలోనూ శరీరానికి కావలసిన శక్తినివ్వడంలో కాలేయం ప్రముఖ పాత్ర వహిస్తుంది. జీర్ణవ్యవస్థకు ఇది తోబుట్టువు లాంటిది. వాస్తవానికి జీర్ణక్రియ పేగుల్లోనే జరుగుతుంది. అయితే జీర్ణమైన ఆహారాన్ని శరీర కణాలు యధాతథంగా తీసుకోలేవు. (ప్రతీకాత్మక చిత్రం)
వైద్యపరంగా ఫ్యాటీ లివర్ అని పిలిచే ఈ పరిస్థితి రెండు రకాల కారణలతో ఏర్పడుతుంది. మొదటిది ఆల్కహాలిక్ కాగా, రెండోది నాన్-ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది.. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. అయితే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మాత్రం జీవన శైలిలో మార్పుల ఫలితంగా వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తరువాతి దశల్లో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. (ప్రతీకాత్మకచిత్రం)
తక్కువ పరిమాణంలో భోజనం
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అంటే.. కాలేయం ఒత్తిడి గురికావడం. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న కాలేయంపై మరింత పనిని విధించకుండా ఉండడం కోసం మీరు తరచూ కొద్ది కొద్దిగా భోజనం చేయాలి. మధ్యలో కొన్ని గంటల విరామం తీసుకోవాలి. విరామ సమయంలో కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆల్కహాల్ వినియోగం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం
మీరు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బారిన పడ్డారంటే.. ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం ఫలితంగా వచ్చినట్లు లెక్క. అయినా ఆల్కహాల్ మానేయలేకపోతే మీ కాలేయ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తులు ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే కాలేయ పరిస్థితి నయం అవుతుంది. ఒకవేళ మానేస్తే ఆరు నెలల వ్యవధిలో కాలేయం నయం కావడం ప్రారంభమవుతుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నవారు కూడా ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయడం శ్రేయస్కరం.
సంతృప్త కొవ్వులు & చక్కెర పదార్థాలను ఆహారంగా తీసుకోవద్దు
పూర్తి పాల ఉత్పత్తులు, ఎర్ర మాంసంలో తరచుగా కనిపించే సంతృప్త కొవ్వులు అనారోగ్యంతో ఉన్న కాలేయానికి ప్రాసెస్ చేయడం చాలా కష్టమైన పని. అదేవిధంగా చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకుంటే కొవ్వు కారణంగా కాలేయంలో ఇప్పటికే ఉన్న వాపు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో కాలేయం వేగంగా నయం కావడానికి, మీరు తప్పనిసరిగా వాటిని తీసుకోవడం మానేయాలి. తేదా పరిమితి తగ్గించాలి.
చురుకుదనం
చాలా కాలేయ వ్యాధులకు ప్రధాన కారణం జీవన శైలిలో మార్పులు. దీంతో చురుకుగా ఉండటం చాలా అవసరం. మీ జీవితంలో ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామాన్ని చేర్చడానికి ప్రయత్నించండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా లిపిడ్ ప్రొఫైల్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నిద్ర
నిద్ర లేమి కారణంగా కాలేయ జీవక్రియ, కొవ్వు పదార్ధాలను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు నిద్ర రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. దీంతో మీ కాలేయ ఆరోగ్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందు కోసం ప్రతి రాత్రి ఆరు నుండి ఎనిమిది గంటలపాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి. (ప్రతీకాత్మక చిత్రం)