స్కిన్ కేర్‌పై ఫోకస్ పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. 2021లో ప్రజలు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను భారీగా కొనుగోలు చేస్తూ చర్మ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. సంవత్సరం మారినా ఆ స్కిన్ కేర్ ట్రెండ్స్ అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్మ సంరక్షణ కోసం ప్రజలు పాటిస్తున్న టాప్ స్కిన్ కేర్ ట్రెండ్స్(Trends) గురించి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
లింగ సమానత్వం- చర్మ సంరక్షణ(Gender-neutral skincare).. చర్మ సంరక్షణ అనేది ప్రతి ఒక్కరికీ సమానంగా ఉండాలి. ఎందుకంటే అందం విషయంలో ఎవరిపై వివక్ష ఉండకూడదు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కంపెనీలు కొన్ని కమ్యూనిటీలను నిర్మిస్తున్నాయి. పురుషులు మేకప్ వేసుకోరని, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోలేరనే పోకడలకు విరుద్ధంగా అందరికీ అందించే ప్రొడక్ట్స్‌ను స్కిన్ కేర్ కంపెనీలు తయారు చేస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
పర్సనలైజ్డ్ స్కిన్ కేర్(Personalized Skin care)..
ప్రజలు వారి నిర్దిష్ట అవసరాలు, చర్మ రకానికి అనుగుణంగా పరిష్కారాల కోసం చూస్తుంటారు. కృత్రిమ మేథస్సు ఆవిర్భావంతో వారు నివసించే వాతావరణ పరిస్థితులకు ఉత్తమంగా సరిపోయే ఉత్పత్తులు, పదార్థాల కలయికను సూచించడం సులభతమరమైంది. ఇది వారి స్కిన్ కేర్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో తోడ్పడుతుంది. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. హైపర్ పర్సనలైజ్డ్ అయ్యేంత వరకు ఈ ట్రెండ్ కొనసాగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
రీఫిల్ చేయగల ప్యాకేజింగ్
ఈ భూమిపై మానవాళిగా మనం చేస్తున్న ప్రతి పని కాలుష్యానికి కారణమవుతోంది. ఆ కాలుష్య కారకాల్లో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉండటం ఆందోళనకరంగా మారింది. కాబట్టి కంపెనీలు ప్రొడక్ట్స్‌ను రీఫిల్ చేయడం లేదా పూర్తిగా కంపోస్ట్ చేసే ప్యాకేజింగ్ తీసుకురావడం ప్రారంభించే సమయం ఆసన్నమైంది. ఈ ట్రెండ్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పర్యావరణంపై శ్రద్ధ వహించే విధంగా కంపెనీలను మారుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)