భారతదేశ ప్రజలకు వారసత్వ సంపదగా లభించిన గొప్ప మార్గం యోగా. ఇది ఎంతో ప్రాచీన కాలపు పద్దతి అయినప్పటికి గత రెండు మూడు దశాబ్దాల నుంచి ఆరోగ్య స్పృహ పరంగా ఆరోగ్య నిపుణులు యోగాను రిఫర్ చేస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ధృడంగా మార్చే యోగా.. ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో అవసరం. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యోగా చేసే మొదటి పని రక్త ప్రసరణను మెరుగుపరచడం. (ప్రతీకాత్మక చిత్రం)
దీని అర్థం శరీరమంతా ఆక్సిజన్, పోషకాల మెరుగైన రవాణా జరుగుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల అవయవాల ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే శరీరం ప్రశాంతంగా ఉండడంతో రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. యోగా శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది, వివిధ కారణాల వల్ల శరీరం ఒత్తిడికి లోనైనపుడు గుండెకొట్టుకునే వేగం పెరుగుతూ ఉంటుంది. యోగా వల్ల దీన్ని సక్రమంగా ఉండేలా చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
యోగా చేసినప్పుడు అంతర్గత అవయవాలు ఉత్తేజం పొందుతాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం దృఢంగా తయారవుతుంది. అంతే కాదు యోగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది శరీరానికి చైతన్యాన్ని, మానసిక విశ్రాంతిని ఇవ్వడం వల్ల శరీరంలో ఆరోగ్య కణజాలం, హార్మోన్ల పనితీరు మెరుగవుతాయి. ఫలితంగా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. మనస్సు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి యోగా సహాయపడుతుంది. ఇది అనవసరమైన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. తద్వారా మంచి నిద్రను సులభతరం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఉదయం వ్యాయామం చేసేటప్పుడు చాలా తేలికైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని పోషకాహార నిపుణులు పూజా చెబుతున్నారు. మీ జీవక్రియను పెంచడానికి అతి తక్కువగా ఆహారం తీసుకోవడం అవసరమంటున్నారు. మనం రోజును ప్రారంభించే ముందు మనం కొంత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఖర్జూరం లేక పండ్లు స్వీకరించి మీ జీవక్రియను స్టార్ట్ చేసి, యోగా చేయవచ్చని పూజా తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
మీ శరీర అనుకూలతను బట్టి ఖాళీ కడుపుతో యోగా చేయాలా లేక ఏదైనా తేలికైన ఆహారం తీసుకోవాలనేది మీకే తెలుస్తుందని వారు అంటున్నారు. ఒక్కరోజు ఖాళీ కడుపుతో యోగా చేయడం... ఒక రోజు ఏదైనా తేలికైన ఆహారం తీసుకుని యోగా చేయడం. ఈ రెండింటిలో మీ శరీరం దేనికి అనుకులంగా అనిపిస్తే దానిపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)