నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో చిన్న వయసులోనే అధిక బరువు సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం సమస్య తీవ్రమవుతోంది. అందుకే చాలా మందికి వారి శరీరంలోని అన్ని భాగాల్లోనూ కొవ్వు పేరుకుపోతుంటుంది. బాడీలో పేరుకుపోయే కొవ్వులో రెండు రకాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అందులో అంతరాంగ కొవ్వు అనే విసెరల్ ఫ్యాట్ (Visceral Fat) అత్యంత ప్రమాదకరమైనది. ఈ రకమైన కొవ్వు పేగులు, గుండె, కాలేయం, పొత్తికడుపు వంటి కీలకమైన అవయవాల పైన.. చుట్టూ పేరుకుపోతుంది. ఇది శరీరం లోపల పెరుగుతుంది కాబట్టి దీన్ని గుర్తించడం చాలా కష్టం. విసెరల్ కొవ్వును కరిగించడానికి సరైన ఆహారం, వ్యాయామం చాలా కీలకం. అనేక అధ్యయనాల ప్రకారం, విసెరల్ కొవ్వును కరిగించేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
వేడి వాతావరణంలో ఉండండి
పోట్లలో పేరుకుపోయే కొవ్వులు రెండు రకాలు. తెల్ల కొవ్వు (ఇది ప్రమాదకరమైనది), గోధుమ కొవ్వు (ఇది మీ పొట్టలోని చెడు కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది). జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం,10 రోజుల పాటు 60, 61 డిగ్రీల మధ్య నివసించిన వ్యక్తుల పొట్టలో గోధుమ రంగులో ఉండే కొవ్వు పెరుగుదలను గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సమయంలో పడుకోండి
జామా నెట్వర్క్ గత జూన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, 1,37,000 మంది వ్యక్తుల నిద్ర షెడ్యూల్ గురించి కొన్ని ప్రశ్నలడిగారు. రాత్రి 10 గంటల తర్వాత పడుకోవడం వల్ల 20% ఊబకాయం సమస్య పెరిగిందని, తెల్లవారుజామున 2 నుంచి 6 గంటల మధ్య పడుకునే వ్యక్తులకు ఈ ప్రమాదం దాదాపు రెట్టింపు (35% నుండి 38%)గా ఉందని అధ్యయనంలో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
5 నిమిషాల పాటు వ్యాయామం చేయండి
ది కొరియన్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక చిన్న అధ్యయనం ప్రకారం, అధిక బరువు గల వ్యక్తులు ఐదు నిమిషాల పాటు మెట్లు ఎక్కడం వల్ల సగటున 7.3 పౌండ్ల శరీర బరువు, 5.5 పౌండ్ల శరీర కొవ్వును కోల్పోతారు. కేవలం 5 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అనేది విసెరల్ కొవ్వును సమర్థవంతంగా తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి
ప్రోటీన్ పుష్కలంగా లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల విసెరల్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా బర్న్ చేయవచ్చని తేలింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, తక్కువ ప్రోటీన్ గల ఆహారం తీసుకున్న వ్యక్తులతో పోలిస్తే ఎక్కువ ప్రోటీన్ గల ఆహారం తీసుకున్న వ్యక్తులు విసెరల్ కొవ్వును వేగంగా కరిగించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
సోడా తక్కువగా తీసుకోండి
చాలా మంది వంటల్లో సోడా ఎక్కువగా వాడుతుంటారు. ఇది పొట్ట వద్ద విసెరల్ ఫ్యాట్ పెరిగేందుకు దారితీస్తుంది. టెక్సాస్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, సోడా ఎక్కువగా వాడని వారి కంటే సోడా ఎక్కువగా తీసుకునే వారి నడుము చుట్టుకొలత సగటున 70 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. సోడా ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆకలి పెరుగుతుంది. ఇది పొట్ట వద్ద కొవ్వు పెరిగేందుకు దోహదం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)