Medicinal Properties : సేజ్ ఆకులను శతాబ్దాలుగా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఇంకా చాలా రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటి ధర ఎక్కువే. 100 గ్రాముల ఎండిపోయిన సేజ్ ఆకుల ధర దాదాపు రూ.200 ఉంది. ఈ మూలికలకు ఇండియాతోపాటూ.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎందుకో తెలుసుకుందాం.
(image credit - wikipedia - Jonathunder - GFDL 1.2)
Alzheimer's : పిల్లలకు మనం సరస్వతి ఆకులు తినిపిస్తాం కదా.. వాటిని తింటే వారికి చదువు బాగా వస్తుందని భావిస్తాం కదా... అలాగే ఈ ఆకులు కూడా మెమరీ పవర్ పెంచుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరైనా సరే.. బ్రెయిన్ బాగా పనిచెయ్యాలంటే.. ఈ ఆకులు వాడాలి. మతిమరపు లాంటి అల్జీమర్స్ వ్యాధి (Alzheimer's disease) రాకుండా ఈ ఆకులు కాపాడగలవు.
Hair and skincare : ఈ ఆకులను హెయిర్ డై తయారీలో వాడుతారు. ఫేస్ మాస్కులు, షాంపూలు, కండీషనర్లలో కూడా వాడుతారు. ఈ ఆకులు జుట్టు, కుదుళ్లకు మేలు చేస్తాయి. చాలా మంది తలకు పట్టించే ఆయిల్లో ఈ ఆకుల పొడిని కలిపి రాసుకుంటారు. మీరు కూడా అలా చెయ్యాలని ప్రయత్నించవద్దు. నిపుణుల సమక్షంలోనే అలా చెయ్యడం మేలు కదా.
ఈ ఆకుల్ని గర్భిణీలు, బాలింతలు ఎక్కువగా వాడకూడదు. అందుకే వీటిని కొద్దిగానే వాడుకుంటే ఆరోగ్యం. మీకు ఈ ఎండిన ఆకులు కావాలి అనుకున్నా, లేక ఈ ఆకుల టీ పొడి కావాలి అనుకున్నా... ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)