ప్రస్తుత 'వర్క్ ఫ్రమ్ హోమ్' సంస్కృతి స్క్రీన్ ద్వారా పని చేసే ధోరణిని బాగా పెంచింది. చదువుల నుంచి ఆఫీసు పని, స్నేహితులతో చాటింగ్, కుటుంబంతో సమయం గడపడం, పెద్ద వ్యాపార ఒప్పందాలు - అన్నీ ఇప్పుడు ఆన్లైన్లోనే అధికంగా సాగుతున్నాయి. అనేక మంది దాదాపు రోజంతా స్క్రీన్ ముందే గడుపుతున్నాయి. మోడ్రన్ వర్క్ కల్చర్ లో మనం ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ ముందు ఉండాల్సిని పరిస్థితి నెలకొంది.(ప్రతీకాత్మక చిత్రం)
స్క్రీన్ దగ్గర కూర్చుని గడిపే సమయం రోజుకు రెండు గంటల వరకు ఉంటే.. స్ట్రోక్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయని డేటా చెబుతోంది. నిరంతరాయంగా స్క్రీన్ ముందు కూర్చొని రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉంటే అది ఒక రకమైన వ్యసనంగా మారడంతో పాటు మనకు స్ట్రోక్ వచ్చే అవకాశాలను మరో 20 శాతం పెంచుతుందని అధ్యాయనంలో తేలింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఒక గంట స్క్రీన్ సమయం ఒక వ్యక్తి యొక్క జీవితకాలం 22 నిమిషాలు తగ్గిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇంకా గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతూ వ్యక్తిని మరణానికి దగ్గరగా చేస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మరొక అధ్యయనం స్క్రీన్ వాడకం మరియు స్ట్రోక్ మధ్య సంబంధాన్ని కనుగొంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పరిశోధన నిజంగా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా యువతకు స్క్రీన్‌ని ఉపయోగించే ధోరణి మరియు సమయం నిరంతరం పెరుగుతోంది. తెరపై కనిపించే నీలి కాంతి మన శరీరంలోని మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్, రాత్రి సమయంలో స్రవించే హార్మోన్. ఈ హార్మోన్ నిద్ర మరియు మేల్కొలుపు మధ్య సంబంధాన్ని నియంత్రిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)