సాధారణంగా ఎసెన్షియల్ ఆయిల్ అందం నుంచి ఆరోగ్యం వరకు ప్రతిదాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. అరోమాథెరపీలో సుగంధ నూనెలను ఉపయగిస్తారు. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, చమోమిలే ఎసెన్షియల్ ఆయిల్, రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వంటి వివిధ ముఖ్యమైన నూనెల అరోమాథెరపీ చికిత్సలో ముఖ్యమైన నూనెలు. చాలా మందికి తెలియని నూనెల్లో బ్లాక్ పెప్పర్ ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి. చాలా మందికి తెలియని నల్ల మిరియాల నూనె ప్రయోజనాలు తెలుసుకుందాం.
మిరియాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కానీ, ఇది రుచిని పెంచడమే కాకుండా.. జలుబు, వివిధ రుగ్మతల వరకు అనేక వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. నల్ల మిరియాలు మన దేశంలో వివిధ వంటకాల్లో వాడతారు.నల్ల మిరియాలలో విటమిన్లు ,ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. పెప్పర్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది చాలా ఆహారాలలో అరుదుగా కనిపిస్తుంది. నల్ల మిరియాలతో తయారైన ఎసెన్షియల్ ఆయిల్ కూడా అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది.
నొప్పి కండరాల తిమ్మిరి..
మిరియాలు శరీర భాగాలకు వేడిచేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పెప్పర్మెంట్ ఆయిల్ నొప్పి, వాపు కోసం ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.కండరాల తిమ్మిరికి ఉపశమనాన్ని అందిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు, వాత నొప్పులతో బాధపడేవారు నొప్పులకు, వాపులకు దీన్ని ఉపయోగించవచ్చు.
ఒత్తిడి, అలసట..
ఎసెన్షియల్ ఆయిల్ లోని ప్రధాన ఔషధ గుణాలు ఒత్తిడి, నిరాశ నుంచి ఉపశమనంతోపాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఒత్తిడి, నిరాశ నుంచి ఉపశమనం, మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. నల్ల మిరియాలు ముఖ్యమైన నూనె వైద్యం చేసే గుణం ఉంటుంది. ఈ ఆయిల్ కొంచెం బలంగా ఉండటం వల్ల కొంతమంది కి ఇది హార్డ్ గా అనిపిస్తుంది. నరాలను శాంతపరచడానికి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్తేజపరిచేందుకు, గుండె దడను తగ్గించేందుకు సహాయపడుతుంది.