సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు గుమ్మడికాయ విత్తనాలు చేసే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఈ విత్తనాల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. జింక్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, సెలీనియం, కాల్షియం, పాస్ఫరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ, బీ.. అన్ని పోషకాలు గుమ్మడికాయ విత్తనాల్లో ఉంటాయి. అందుకే వీటిని తింటే.. పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. శుక్ర కణాలు చలనం కలిగి ఉండి సంతానం కలిగే అవకాశాన్ని పెంచుతాయి.
గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే ప్రోటీన్లు, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్, ఐరన్, జింక్ తదితర పోషకాలు పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల వారిలో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాదు.. గుమ్మడికాయ విత్తనాలను తరచూ తినడం వల్ల పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు రాకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
శరీర ముడతలు తగ్గాలన్నా ఇవి తింటే మంచిది. అంతేకాదు, కండరాలకు మరమ్మత్తులు చేయడంలో, కొత్త కణాలను నిర్మించడంలో గుమ్మడికాయ విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయి. నిత్యం వ్యాయామం చేశాక గుమ్మడికాయ విత్తనాలను తింటే చక్కని దేహ దారుఢ్యం సొంతమవుతుంది. వాటిల్లో ఉండే వాపు, మంట తదితరాలు తగ్గుతాయి. అవి జీర్ణశక్తిని పెంచుతాయి.