పసుపులో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో పసుపు మరియు శెనగ పొడిని తీసుకోండి. రెండు చెంచాల పాలను కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి.