మరికొద్ది గంటల్లో క్రిస్మస్ పండుగ రాబోతోంది. ఈ పండుగ సందడి ఇప్పటికే మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు అప్పుడే ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా క్రిస్మస్ పర్వదినాన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రేమ, ఆప్యాయతల కలబోతతో మరపురాని జ్ఞాపకాలను ఏర్పరచుకుంటారు.
క్రిస్మస్ చెట్టును అలంకరించండి
క్రిస్మస్ పర్వదినాన ఎంతో కోలాహలం నెలకొంటుంది. ఈ సమయంలో చాలామంది క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తుంటారు. క్రిస్మస్ ట్రీని అలంకరిస్తే ఒక స్పెషల్ ఫీల్ వస్తుంది. క్రిస్మస్ చెట్టు ఫెస్టివల్ మూడ్, చీర్స్ను తెస్తుంది. ఐక్యమత్యంగా, జతగా ఉన్నామని ఈ చెట్టు తెలియచేస్తుంది. అయితే ప్రేమికులు ఒక క్రిస్మస్ చెట్టును కొనుగోలు చేసి దానిని కొన్ని అందమైన ఆభరణాలతో అలంకరించవచ్చు.
బహుమతులు ఇచ్చి పుచ్చుకోండి.. క్రిస్మస్ అనేది ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన సమయం. ఈ స్పెషల్ డే సందర్భంగా జంటలు డేట్ నైట్‌లో ఒకరికొకరు మంచి గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది శాంటా నుంచి బహుమతులు స్వీకరించే చిన్ననాటి సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతుంది. అలాగే ప్రేమికుల్లో తమకు తాము స్పెషల్ అనే భావన కలిగిస్తుంది.
కలిసి కేక్ తయారు చేయండి.. క్రిస్మస్ రోజున అత్యంత రుచికరమైన, నోరూరించే ప్లమ్ కేక్, ఫ్రూట్ కేక్‌లను అందరూ తయారు చేస్తుంటారు. అయితే ప్రేమికులు కేక్‌ను కలిసి బేక్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి కేక్ ప్రిపేర్ చేస్తే.. ఆ జ్ఞాపకం ఎప్పటికీ మదిలో భద్రంగా ఉంటుంది. క్రిస్మస్ దినాన కలిసి కేక్ తయారు చేయడమనేది అత్యంత ప్రత్యేకమైన.. చిరస్మరణీయమైన సంప్రదాయాలలో ఒకటి. ఇది కచ్చితంగా జంటలను దగ్గర చేస్తుంది.
క్రిస్మస్ సినిమాలు
క్రిస్మస్ రోజున క్రిస్మస్ సినిమాలు చూడటం ద్వారా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకోవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ సినిమాలు ప్రేమ, రొమాన్స్, సాన్నిహిత్యం, అన్యోన్యత గురించే ఉంటాయి. మీరు, మీ భాగస్వామి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, శీతాకాలంలో పాప్‌కార్న్, హాట్ చాక్లెట్ తింటూ క్రిస్మస్ సినిమాలను చూసి బాగా ఎంజాయ్ చేయండి.
చర్చి కార్యక్రమాలకు హాజరవ్వండి
క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ సాయంత్రం చర్చిలు భక్తులతో శోభను సంతరించుకుంటాయి. ఈ సమయంలో చర్చిలు అత్యంత అందమైన ప్రదేశాలుగా మారుతాయి. క్రిస్మస్ పాటలు పాడే గాయక బృందంతో చర్చిలు ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. అంతేకాకుండా, చర్చిల్లో క్రిస్మస్ స్ఫూర్తిని పెంచే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి. ఈ చర్చ కార్యక్రమాలకు ప్రేమ జంట హాజరై తమ సమయాన్ని ఎంతో ఆనందంగా గడపవచ్చు.