HEALTH KNOW WHAT HAPPENS IF YOU EAT MORE EGGS IN A DAY HERE IS THE DETAILS AK
Stop Eating More Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. ఎక్కువ తినడం వల్ల కలిగే నష్టమేంటి ?.. పూర్తి వివరాలు
Stop Eating More Eggs: ప్రతి రోజు గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే విషయం అందరికీ తెలుసు. అయితే రోజు ఎక్కువ గుడ్లు తినడం వల్ల ప్రమాదం కూడా ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఎక్కువ గుడ్లు తినడం వల్ల చనిపోయాడు. తాను 50 గుడ్లు తింటానని సవాల్ చేసిన అతడు.. 42 గుడ్లు తిన్న తరువాత చనిపోయాడు. ఈ నేపథ్యంలో అసలు ఓ వ్యక్తి రోజుకు ఎన్ని గుడ్లు తినాలనే విషయం తెలుసుకోవడం చాలా అవసరం.
2/ 7
గుడ్లు తినడం వల్ల మనలో శక్తి పెరుగుతుందనేది వాస్తవం. అయితే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
3/ 7
రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే జిమ్‌లకు వెళ్లే వాళ్లు, శరీరంగా పెంచేవాళ్లు ఎక్కువ గుడ్లు తింటుంటారు. అలాంటి వాళ్లు రోజుకు 4 నుంచి 5 గుడ్లను కూడా తింటుంటారు.
4/ 7
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కిడ్నీలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
5/ 7
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీన్ని పట్టించుకోకుంటే ఇబ్బందులు ఎక్కువవుతాయి.
6/ 7
గుడ్డులో లభించే పోషకాలు విటమిన్ ఏ, బి12, డి, ఈ, ఒమేగా 3. అయితే రోజుకు రెండు గుడ్లు తింటే సరిపోతుంది.
7/ 7
గుడ్డులోని తెల్ల సోనా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్లు దీన్ని తినడం ఉత్తమం.