కుటంబం బాధ్యతల కారణంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే పురుషుల కంటే మహిళలే తమ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. నెలవారీ రుతుక్రమంతో పాటు గర్భదారణ వంటి అంశాలు మహిళల శరీరంపై అధిక ప్రభావం చూపిస్తాయి.
2/ 9
ఒకవేళ మహిళ ప్రతి రోజు ఒక అరటి పండు తింటే.. అనేక సమస్యల నుంచి బయటపడతారు. అలసట, ఒత్తిడి తగ్గించడం వంటి వాటికి అరటి పండు ఒక మంచి ఔషధం.
3/ 9
అరటి పండు తక్షణం శక్తిని ఇస్తుంది. అందుకే అది ఒక పూర్తి ఆహారం. అరటి పండు తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. వెంటనే శరీరంలో శక్తి వస్తుంది.
4/ 9
మహిళలు ఉదయాన్నే అరటి పండు తింటే వాళ్లు రోజంతా ఎనర్జిటిక్‌గా ుంటారు. శరీరానికి అనేక పోషకాలు అందిస్తాయి.
5/ 9
అరటి పండ్లలో పొటాషియమ్ ఉంటుంది. అది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని సృష్టించే హార్మోన్లను పొటాషియమ్ కంట్రోల్ చేస్తుంది.
6/ 9
ఒత్తిడి పెరిగినప్పుడల్లా అరటి పండు తినడం మంచిది. అరటి పండులో కార్బోహైడ్రేట్లు, పొటాషియమ్, విటమిన్ బి6, ఫైబర్, మెగ్నీషియమ్ ఉంటాయి. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయడంతో పాటు మన మూడ్ మారేలా చేస్తుంది.
7/ 9
గర్భిణీలు ప్రతి రోజు ఒక అరటి పండు తినాలి. అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అది కొత్త కణాలు ఏర్పడేందుకు దోహదపడుతుంది. అంతేకాదు కడుపులోని పిండం పెరుగుదలకు ఇది దోహదం చేస్తుంది.
8/ 9
మహిళల్లో ఎనీమియా సాధారణమైన సమస్య. ప్రతి రోజు ఒక అరటి పండు తినడం వల్ల ఎనీమియాను ఎదుర్కోవచ్చు. కొత్త రక్తం తయారీకి అరటి పండు దోహదపడుతుంది.
9/ 9
మహిళల్లో ఎనీమియా సాధారణమైన సమస్య. ప్రతి రోజు ఒక అరటి పండు తినడం వల్ల ఎనీమియాను ఎదుర్కోవచ్చు. కొత్త రక్తం తయారీకి అరటి పండు దోహదపడుతుంది.