బరువు తగ్గాలనే కోరిక ఊబకాయులందరిలో ఉంటుంది. అయితే కొవ్వు కరిగించేందుకు వాకింగ్ (Walking) సరిపోతుందని వీరికి అనిపించకపోవచ్చు. అలాగని రన్నింగ్ (Running) కూడా వీరు చేయలేరు. ఎందుకంటే వాకింగ్ అత్యంత తేలికైనా వర్కౌట్ అయితే.. రన్నింగ్ మాత్రం చాలా కష్టమైన వర్కౌట్. కాస్త బొద్దుగా ఉన్న వారికి ఈ రెండు వర్కౌట్స్ కూడా సూట్ అవ్వవు. నడక ద్వారా నెమ్మదిగా బరువు తగ్గుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
రన్నింగ్ చేస్తే వేగంగా లావు తగ్గుతారు కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది. ఇలాంటప్పుడు జాగింగ్ (Jogging) అనేది ఉత్తమ వ్యాయామంగా నిలుస్తుంది. అయితే ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయడానికి జాగింగ్ ఒక్కటే సరిపోదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ చేసేటప్పుడు ఒక ట్రిక్ ఫాలో అయితే.. సులభంగా రెట్టింపు స్థాయిలో కొవ్వు, కేలరీలను కరిగించవచ్చని సలహా ఇస్తున్నారు. ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
జాగింగ్ చేయడం లేదా స్థిరమైన వేగంతో మెల్లగా ఉరకడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జాగింగ్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ దోహదపడుతుంది. మీరు ఎక్కడైనా జాగింగ్ చేయవచ్చు. అయితే మీరు ఆరోగ్య ప్రయోజనాలను మరింత పెంచుకోవడానికి, ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలంటే జాగింగ్ చేస్తున్నప్పుడు ఒక ట్రిక్ ఫాలో అవ్వాలి. రెండు రెట్లు ఎక్కువ కేలరీలు కరిగించేందుకు ఏటవాలుగా ఉన్న ఉపరితలంపై జాగింగ్ చేయాలి. ఇందుకు మీరు మీ సమీపంలోని ఒక ఎత్తయిన కొండను ఎంచుకోవచ్చు.
మెరుగైన ఫలితాల కోసం వేగం, దూరాన్ని పెంచడం బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. లేదంటే మీరు ఎత్తయిన ప్రాంతాలపైకి జాగింగ్ చేసుకుంటూ ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఎత్తైన కొండలపైకి జాగింగ్ చేయడం ద్వారా మీరు మీ పొత్తి కడుపులోని కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే మీ కాళ్లలోని కొవ్వు కరిగిపోయి అవి దృఢంగా మారుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఎత్తయిన మైదానాలపైకి ఎలా జాగింగ్ చేయాలి?
మొదటగా మీరు జాగింగ్ చేయడానికి అనువుగా ఉన్న సమీపంలోని ఒక కొండ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోండి. లేదా సమతలమైన లేదా చదునైన నేల స్థాయి కంటే కొంచెం ఎత్తులో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి. మీరు ఇక్కడ రోజూ జాగింగ్ చేయవచ్చు. ఈ ప్రాంతంలో మీరు పైకి చేరుకునే వరకు నెమ్మదిగా జాగింగ్ చేయడం ప్రారంభించండి. ఆపై నెమ్మదిగా మీరు ప్రారంభించిన చోటికి నడవండి. ఇది హృదయ స్పందన రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీ శ్వాస సక్రమంగా పీల్చుకోవడానికి అనుమతిస్తుంది. ఇలా మూడు నుంచి ఐదు సార్లు జాగింగ్ చేస్తూ పైకెళ్లి కిందకి మెల్లగా నడవండి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల బరువు తగ్గడం సాధ్యమవుతుంది. మీకు సమీపంలో ఎలాంటి కొండ ప్రాంతాలు లేనట్లయితే... ఇంక్లైన్ లేదా ఏటవాలు ఎఫెక్ట్ కోసం ట్రెడ్మిల్ యంత్రాన్ని కాస్త నిటారుగా ఉండేలా సెట్ చేసుకోండి. ఎక్కువ సేపు వేగంగా జాగింగ్ చేయండి. తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు వేగాన్ని తగ్గించి, 15 నుంచి 20 నిమిషాల పాటు అదే విధంగా వేగంతో జాగింగ్ చేయండి.