మహిళలకు బహుమతులంటే చాలా ఇష్టం. ప్రేమతో ఏది ఇచ్చినా వారు ఆనందిస్తారు. అయితే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా.. మీకు ప్రియమైన వారికి ఆర్ధికంగా భరోసా ఇచ్చేలా ఫైనాన్షియల్ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి. మహిళలకు ఆర్ధిక భద్రత ఎంత అవసరమో మనకు తెలుసు. అందుకే మహిళల అవసరాలకు ఉపయోగపడే ఫైనాన్షియల్ గిఫ్ట్స్ కొన్నింటిని ఇచ్చేలా ప్లాన్ చేయొచ్చు. అవేంటంటే.. (ప్రతీకాత్మక చిత్రం)
గిఫ్ట్ కార్డ్
షాపింగ్ చేయాలనుకున్నప్పుడు వెంటనే రిడీమ్ చేసుకోగలిగేలా గిఫ్ట్ కార్డ్‌ని ఇవ్వొచ్చు. ఆమె దాన్ని భవిష్యత్తులో మీ కోసం, మీ పిల్లల కోసం లేదా మరే ఇతర అవసరాలకోసమైనా ఉపయోగించుకుంటుంది. అయితే, ఆమె అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బు ఉన్న కార్డును ఆమెకు బహుమతిగా ఇవ్వండి. ఈ ప్రత్యేకమైన బహుమతిని ఆమె కచ్చితంగా ఇష్టపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
క్రెడిట్ కార్డు
ప్రతిసారి మిమ్మల్ని డబ్బు అడగడానికి మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పడుతుండవచ్చు. అందుకే అలాంటి ఇబ్బందులు లేకుండా ఆమెకు ఓ క్రెడిట్ కార్డ్ బహుమతిగా ఇవ్చొచ్చు. ఆ కార్డుని వినియోగించుకునేందుకు పూర్తి అధికారం, స్వేచ్ఛను ఇవ్వాలి. ఆమె తనకు నచ్చినవి.. అవసరమైనప్పుడల్లా వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించాలి. ఇలా చేయటం వల్ల ఆమె తన అవసరాలను తీర్చుకోడానికి సాయం చేసినవారవుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
క్రిప్టో కరెన్సీ
కొంత మార్కెట్ రీసెర్చ్ చేసి భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉన్న క్రిప్టో కాయిన్స్‌ను ఆమెకోసం కొనండి. క్రిప్టోకరెన్సీ ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. ప్రస్తుతం నడుస్తున్న ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ ఇదే.. ఆమె పెట్టుబడి పెట్టడానికి భయపడితే.. మీరే ఆ పని చేయండి. మార్కెట్ పుంజుకున్న తర్వాత ఆమె మీ నిర్ణయాన్ని మెచ్చుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
గోల్డ్
బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడని మహిళలు ఉండరు. అందుకే ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీ భాగస్వామి పేరుమీద గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. బంగారం ధర.. కాలంతో పాటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత.. తప్పకుండా మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. దానికి మీ పార్ట్నర్ కచ్చితంగా సంతోషిస్తుంది. అందుకే బంగారు ఆభరణాలు లేదా బంగారు బిస్కెట్లు, బంగారు నాణేలు, గోల్డ్ ఫండ్లను కొనుగోలు చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రతీ నెలా రూ.500 చొప్పున 20 ఏళ్లు జమ చేసినా రూ.5 లక్షల రిటర్న్స్ వస్తాయి. సంపాదన పెరుగుతున్నకొద్దీ పొదుపు పెంచుకుంటూ పోతే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మీరు సెలెక్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పైన ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో కనిపించిన ప్రతీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం పొరపాటే. (ప్రతీకాత్మక చిత్రం)