Monsoon foot care tips: వర్షాకాలంలో ఎక్కువగా కాళ్లు నానుతూ ఉంటాయ్.. ఇలా చేయకపోతే ఇన్‌ఫెక్షన్స్ గ్యారంటీ..

వర్షాకాలంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్యల్లో చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. మొత్తం చర్మం సంగతి ఎలా ఉన్నా కాళ్లు మాత్రం ఎక్కువగా నీళ్లలో నానుతూ ఉంటాయి.. కాబట్టి వర్షా కాలంలో పాదాల సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల పాదాలు పగలడం, దుర్వాసన రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అథ్లెట్ ఫుట్, అలర్జీలు ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఇంట్లోనే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.