మన శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. మిగతా పార్టుల్లో కొవ్వును కరిగించడం తేలికే గానీ.. పొట్ట, నడుం చుట్టూ రింగులా పేరుకునే కొవ్వును కరిగించడం చాలా కష్టం. దాని వల్ల పొట్ట పెరుగుతుంది. ఆకలి పెరుగుతుంది. అందుకని ఎక్కువ తింటే.. పొట్ట మరింత పెరుగుతుంది. ఇలా సమస్య పెద్దదవుతుంది. దాని వల్ల షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ ఇలా చాలా వ్యాధులు రాగలవు. కాబట్టి.. పొట్ట, బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
ఎక్కువ ప్రోటీన్ (మాంసకృత్తులు ఉండే ఆహారం) తినడం వల్ల మీ ఆకలి తగ్గుతుంది. అలాగే.. మీ జీవక్రియ పెరుగుతుంది. అంటే... ప్రోటీన్ అరగడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా బొడ్డు దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది. గుడ్లు, చికెన్, చేపలు, బీన్స్, చిక్కుళ్ళు వంటి ఆహారాలు ప్రోటీన్ ఎక్కువగా కలిగిన ఆహారాలు.
ఎక్కువ శక్తి (strength training)ని ఉపయోగించే వ్యాయామం చెయ్యండి. దీని వల్ల కండరాలు బలంగా అవుతాయి. అవి జీవక్రియ బాగా జరిగేలా చేస్తాయి. జీవక్రియ బాగా జరిగినప్పుడు.. కొవ్వు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుంది. బొడ్డు, పొట్ట చుట్టూ రింగులా ఉన్న కొవ్వు తగ్గడాన్ని మీరు గమనించగలరు. తేడా మీకు తెలుస్తుంది. ఇందుకోసం స్క్వాట్స్ (squats), లంగ్స్ (lunges), ప్లాంక్ (planks)ల వంటి వ్యాయామాలపై దృష్టి పెట్టండి.
బొడ్డు కొవ్వును తగ్గించడానికి సమయం, స్థిరమైన కృషి అవసరం. ఈ చిట్కాలను పాటిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ లక్ష్యాలను సాధించవచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)