రొమ్ము క్యాన్సర్. ఆధునిక సమాజంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ సమస్య గతంలో కన్నా వేగంగా పెరుగుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలకు అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణం. అందుకే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే ఏం చేయాలి. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను తెలుసుకుందాం.
ఇది గమనిస్తూ ఉండాలి.నిపుల్స్‌ని నొక్కితే అవి సరిగా లోపలికి వెళ్లకపోయినా, రెండు కూడా డిఫరెంట్ సైజ్‌లలో ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాలి. బ్రెస్ట్ నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా ద్రవం బయటకు వస్తుంటే అనుమానించాల్సిందే. కాలర్ బోన్స్, చంకల్లో ఉండే లింఫ్ గ్రంథుల్లో వాపు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు భావించాలి.
రొమ్ములు, చంకల్లో గడ్డలు ఉన్నట్లుగా అనిపించినా అనుమానించాలి. రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం, రొమ్ములపై గుంటలు, నారింజ పండు రంగులోకి మారితే అనుమానించాల్సిందే. ఈ లక్షణాలు చెక్ చేసుకోవాలిప్రతీ మహిళ కూడా ఎవరికీ వారే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. పీరియడ్స్ స్టార్ట్ అయిన 6 వ రోజు అద్దం ముందు నిల్చోవాలి.
క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశలో అంటే సవ్య, అపసవ్య దిశలో రొమ్ములను పరీక్షించాలి.ఇలా పరీక్షించే సమయంలో మీకు ఏవైనా గడ్డల్లా తగిలితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.ముందుగానే రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించి.. చికిత్స తీసుకోవడం వల్ల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)