థైరాయిడ్ (Thyroid) అనేది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంధి. ఇది మెడ కింది భాగంలో ఉంటుంది. ఈ గ్రంధి జీవక్రియ, ఎదుగుదల, డెవలప్మెంటల్ యాక్టివిటీస్‌ను రెగ్యులేట్ చేయడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉన్నప్పుడు మెటబాలిజంలో మార్పులు, బరువు పెరగడం, ఎముకల సమస్యలు, జుట్టు రాలడం, గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యత, ఉదరకుహర వ్యాధి, మధుమేహం వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.
దీనిని సాధారణంగా హైపోథైరాయిడిజం అంటారు. ఈ సమస్య ఎదురైతే థైరాయిడ్ తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయదు, ఇది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. ఈ సమస్యపై బెంగళూరులోని ఆస్టర్ CMI హాస్పిటల్ హెడ్ - క్లినికల్ న్యూట్రిషన్ డైటెటిక్స్ ఎడ్వినా రాజ్ కొన్ని సూచనలు చేశారు. (Ms Edwina Raj, Head – Clinical Nutrition Dietics, Aster CMI Hospital, Bengaluru)
హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న రోగులు సరైన డైట్‌తో బరువు తగ్గడం కష్టతరమవుతుంది. కానీ ఇది బరువు, ఆరోగ్యంపై తుది తీర్పు కాదు. ఆహారం, జీవనశైలిలో మార్పులతో బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కాల్షియం, ప్రోటీన్, అయోడిన్, సెలీనియం, జింక్ వంటివి అందేలా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను చేర్చే ప్రయత్నం చేయాలి. వివిధ రకాల ఆహార పదార్థాలతో కీలక పోషకాలను సమతుల్యం చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్ పనితీరుకు అవసరమైన కీలక ఐదు ఆహార పదార్థాలు ఇవే..
* సీడ్స్, నట్స్ : బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ సరిగ్గా పని చేసేలా ప్రభావం చూపుతాయి. చియా, గుమ్మడి గింజల్లో జింక్ సమృద్దిగా ఉంటుంది. థైరాయిడ్ రోగులలో సాధారణంగా అతిగా తినే సమస్య ఉంటుంది, దీన్ని ఆయిల్ సీడ్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
* ముఖ్య గమనిక : హైపోథైరాయిడిజం నుంచి కోలుకునే మార్గం సాధారణమైనది. రోగి మందులు తీసుకుంటున్నంత కాలం ఎటువంటి సమస్యలు ఉండవు. చికిత్స తీసుకోకపోతే శరీరాన్ని ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు, తదుపరి గుండె జబ్బులు, వంధ్యత్వం, బోలు ఎముకల వ్యాధి వంటివి ప్రభావితం చేయవచ్చు. మధుమేహం, కీళ్లనొప్పులు, రక్తహీనత వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అందువల్ల ముందస్తు రోగనిర్ధారణ, పరిస్థితి సరైన నిర్వహణ వంటివి తదుపరి సమస్యలకు చెక్ పెడతాయి.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, రోగులు వారి ఎండోక్రైన్ వ్యవస్థను ఉత్తేజపరిచే, సపోర్ట్ చేసే యోగా వంటి శారీరక కార్యకలాపాలను చేపట్టడం మంచిది. వీటితో శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఇది థైరాయిడ్‌కు అద్భుతంగా సహాయపడుతుంది. మద్యపానం, ధూమపానం నివారించడం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. పైన పేర్కొన్న అన్ని ఆహారాలను తీసుకునే ముందు క్లినికల్ డైటీషియన్, ఎండోక్రినాలజిస్ట్ సలహాలు తీసుకోవడం మంచిది.
థైరాయిడ్ మెడిసిన్ పనితీరుకు ఆటంకం కలిగించే ఆహారాలపై జాగ్రత్తగా ఉండాలి. కాఫీ, సోయా, బొప్పాయి, ద్రాక్షపండు, ఫైబర్, కాల్షియం సప్లిమెంట్స్ వంటి వాటిని పగటిపూట తీసుకోకపోవడం మంచిది. అయోడైజ్డ్ ఉప్పు, మొలకెత్తిన మిల్లెట్లను తీసుకోవాలి. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అయోడైజ్ చేయని గులాబీ ఉప్పును ఉపయోగించకుండా ఉండండి. బరువు తగ్గడానికి ఉపయోగించే క్రోమియం పికోలినేట్తో కూడిన పోషకాహార సప్లిమెంట్లు థైరాయిడ్ మెడిసిన్ పనితీరును బలహీనపరుస్తాయి. గోయిట్రోజెన్లు (క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, కాలే, పెర్ల్ మిల్లెట్, కాసావా, వేరుశెనగ నూనె మొదలైనవి) అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయాలి. పూర్తిగా నివారించడం మంచిది కాదు. అవి ఇతర యాంటీఆక్సిడెంట్ లేదా క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలను కలిగి ఉంటాయి.