భోజనం తినే సమయంలో లేదంటే తిన్న వెంటనే నీటిని తాగితే.. ఆ ప్రభావం జీర్ణక్రియపై పడుతుంది. వాస్తవానికి ఆహారం కడుపులోకి వెళ్లిన వెంటనే.. జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మీరు నీరు తాగితే... జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. తద్వారా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.