Health Tips: బొప్పాయి పండుని ఇష్టంగా తింటున్నారా? వీటితో పాటు అస్సలు తినొద్దట..
Health Tips: బొప్పాయి పండుని ఇష్టంగా తింటున్నారా? వీటితో పాటు అస్సలు తినొద్దట..
Health Tips: బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే కొన్ని రకాల ఆహార పదార్థాలను బొప్పాయి పండుతో కలిపి తినకూడదు. మరి అవేంటి? బొప్పాయితో కలిపి తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.
బొప్పాయి చాలా మందికి ఎంతో ఇష్టమైన పండు. ఇది ఏడాది పొడవునా సులభంగా లభిస్తుంది. బొప్పాయి పండులో చాలా పోషకాలు ఉన్నాయి. అందువల్ల ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లభిస్తాయి. ఐతే బొప్పాయి పండను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు. అలా చేస్తే.. ఆరోగ్యానికి నష్టం చేకూరే అవకాశముంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదే. కానీ వీటిని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తినకూడదు. వీటితో పాటు బొప్పాయిని తీసుకుంటే.. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
బొప్పాయి పండును నారింజతో కలిపి తినకూడదు. నారింజ పుల్లగా ఉంటుంది. బొప్పాయి తీపి. ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల... అతిసారం, అజీర్ణం వంటి సమస్యలు ఉండవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
చాలా మందికి బొప్పాయి చాట్ తినే అలవాటు ఉంటుంది. ఇందులో నిమ్మకాయ వాడతారు. కానీ అలా చేయకూడదు. బొప్పాయితో నిమ్మకాయను తింటే.. రక్త సంబంధిత సమస్యలు వస్తాయి. రక్తహీనత వచ్చే ప్రమాదముంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
బొప్పాయితో పెరుగును పొరపాటు కూడా తినవద్దు. బొప్పాయి ఒంటికి వేడి చేస్తుంది. పెరుగు చలువ చేస్తుంది. అందుకే వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, జలుబు, ఒళ్లు నొప్పుల సమస్యలు రావచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)