HEALTH HAPPY FATHERS DAY 2021 HERE IS THE DETAILS OF RIGHT AGE TO BECOME A FATHER NS
Happy Father’s Day: పురుషులు తండ్రిగా మారడానికి సరైన వయస్సు ఏదో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఈ రోజు ఫాదర్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంతో పురుషుడు తండ్రి కావడానికి సరైన సమయం ఏంటన్న విషయాలపై నిపుణులు, పరిశోధనలు ఏం చెబుతున్నాయి? తదితర వివరాలు మీ కోసం..
మహిళలు గర్భం ధరించడానికి సరైన సమయం గురించి వైద్యులు అనేక టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా వివరిస్తుంటూ ఉంటారు. అయితే.. పురుషులు తండ్రిగా మారడానికి సరైన సమయం గురించి ఎక్కడా పెద్దగా చర్చ కనిపించదు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
40 ఏళ్లు పైబడిన పురుషులకు పుట్టబోయే పిల్లల్లో చాలా సమస్యలు ఉండవచ్చని ఇటీవల నిర్వహించిన పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
పురుషులు తండ్రిగా మారడానికి 22 నుంచి 25 ఏళ్లు సరైన వయస్సు అని నిపుణులు చెబుతున్నాయి. అయితే మారిన ఈ పరిస్థితుల్లో 28-30 సంవత్సరాలు వేచి ఉండవచ్చని వారు చెబుతున్నారు. అయితే.. 30 ఏళ్లు దాటితే మాత్రం పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
30 ఏళ్ల అనంతరం శరీరంలోని టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అలాగే, 30 సంవత్సరాల తరువాత, స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. నెమ్మదిగా పురుషత్వం యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది వారి భార్యాల గర్భధారణ విషయంలో సమస్యలకు దారితీస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
పిల్లలు పుట్టడానికి తక్కువ అవకాశం ఉండటానికి జీవనశైలి మరొక కారణం. జంక్ ఫుడ్, ధూమపానం మరియు పోషకాల కొరతతో స్పెర్మ్ నాణ్యత తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)